Naga Manikanta intresting comments about house mates
Naga Manikanta : బిగ్ బాస్ సీజన్ 8 దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇప్పటికే హౌస్ లో నుండి బేబక్క, సీత, సోనియా, శేఖర్ భాషా తో పాటు మరొకొందరు ఎలిమినేట్ కాగా ఈ వారం మణికంఠ హౌస్ లో నుండి బయటికి వచ్చాడు. తన స్వంత నిర్ణయంతో నాగ్ ని రిక్వెస్ట్ చేసి బయటికి వచ్చేసాడు మణి.
బయటికొచ్చిన మణికంఠ వరుస ఇంటర్వూస్ ఇస్తున్నాడు. అయితే ఆ ఇంటర్వ్యూ లో హౌస్ లో తను ఎవరితో ఎక్కువ క్లోజ్ అయ్యాడన్న విషయాన్ని తెలిపాడు. తను మాట్లాడుతూ.. విష్ణు, గంగవ్వ, నిఖిల్, అందరూ నాతో క్లోజ్ గా ఉండేవారు. విష్ణు, గంగవ్వ కాస్త ఎక్కువ ఉండేవారు. వాళ్ళతో బాగా కనెక్ట్ అయ్యా. ఆ చనువుతోనే ఈ వారం నేను సేవ్ అయితే గంగవ్వకి బంగారు ముక్కుపుడక కొనిస్తా అని మాట ఇచ్చా అంటూ తెలిపాడు.
Also Read : Naga Manikanta : బిగ్ బాస్ తర్వాత మణికంఠ తన భార్యతో కలిసాడా లేదా.. ఏమన్నాడంటే?
ఈ విషయం పక్కన పెడితే మణి ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో అదే స్థాయిలో నెగిటివిటి మూటగట్టుకున్నాడు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి యష్మి, విష్ణు, ప్రేరణ.. ఇలా అందరికి హగ్స్ ఇచ్చేవాడు. మెల్లగా ఇది ఎక్కువ అవ్వడంతో యష్మి కి నచ్చలేదు. మణితో ఈ విషయం గురించి గొడవ కూడా పెట్టుకుంది. అలా ఈ విషయం నాగ్ సర్ దాకా వెళ్లడంతో నాగార్జున సైతం మణికి వార్నింగ్ ఇచ్చాడు.