Naga Manikanta : బిగ్ బాస్ తర్వాత మణికంఠ తన భార్యతో కలిసాడా లేదా.. ఏమన్నాడంటే?

Naga Manikanta : బిగ్ బాస్ తర్వాత మణికంఠ తన భార్యతో కలిసాడా లేదా.. ఏమన్నాడంటే?

Naga Manikanta comments on his Wife after Bigg Boss elimenation

Updated On : October 22, 2024 / 3:38 PM IST

Naga Manikanta : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత బిగ్ బాస్ మరింత ఆసక్తిగా మారింది. గొడవలు మరింత పెరిగాయి. ఎవరి క్యారెక్టర్ ఎలాంటిదో ఆడియన్స్ కి మరింత క్లారిటీ వచ్చింది. నామినేషన్స్ జోరు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది.

మరోవైపు ఈ వారం మణికంఠ ఎలిమినేట్ అయ్యారు. మణి తన సొంత నిర్ణయం ప్రకారమే హౌస్ నుండి వెళ్ళిపోయాడు. అయితే మణి ఇంటి నుండి వెళ్లిపోవడానికి కారణం తన ఆరోగ్యమే అని అంటున్నాడు. ఫిజికల్ టాస్క్ లు ఆడలేక, హౌస్ మేట్స్ తో గొడవ పడలేకే ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా మణి తెలిపాడు.

Also Read : Naga Vamsi : ప్రొడ్యూసర్స్ కి హీరోయిన్స్ కి మధ్య ఏదో ఉందని అనుకుంటారు.. కానీ.. నిర్మాత ఆసక్తికర వ్యాఖలు

అయితే ఎలిమినేషన్ తర్వాత ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. బిగ్ బాస్ తర్వాత తన భార్యతో కలుస్తాడా లేదా అన్న క్లారిటీ ఇచ్చాడు. హౌస్ కి వచ్చినప్పటి నుండి మణి తన భార్య, బిడ్డ కావాలంటూ ఎమోషనల్ అయ్యేవాడు. తాజాగా తన భార్య తన దగ్గరికి వచ్చిందని, లెటర్ రాసి పంపినప్పుడే మేము కలిసిపోయామని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటి నుండి మేము కలిసే ఉంటామని అన్నాడు. మొత్తానికి బిగ్ బాస్ ద్వారా మణి కోరుకున్నట్టు తన భార్యతో కలిసిపోయాడు.