Naga Vamsi : ప్రొడ్యూసర్స్ కి హీరోయిన్స్ కి మధ్య ఏదో ఉందని అనుకుంటారు.. కానీ.. నిర్మాత ఆసక్తికర వ్యాఖలు

Naga Vamsi : ప్రొడ్యూసర్స్ కి హీరోయిన్స్ కి మధ్య ఏదో ఉందని అనుకుంటారు.. కానీ.. నిర్మాత ఆసక్తికర వ్యాఖలు

Producer Naga Vamshi Shocking Comments About Heroines And Producers

Updated On : October 22, 2024 / 3:21 PM IST

Naga Vamsi : సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అంతేకాదు అయన సినిమాలపై ఏ అప్డేట్ ఇచ్చినా కూడా అది సెన్సేషన్ అవుతుంది. ఈ మధ్య ఆయన ఏం మాట్లాడినా కూడా అది వైరల్ గా మారుతుంది .

అయితే తాజాగా అయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. బయట చాలా మంది ప్రొడ్యూసర్స్ కి హీరోయిన్స్ కి మధ్య ఎదో ఉందని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు కాదు గాని ఒకప్పుడు మాత్రం ప్రొడ్యూసర్స్ కి ఏంటి హీరోయిన్స్ తో మంచి టైమ్ పాస్ చేస్తూ ఉంటారు అని అనుకునేవారు. కానీ అసలు నిజం వాళ్లకి తెలీదు. లోపల మేము ఎంత కష్టపడతామో మాకే తెలుసు.

Also Read: Dhoom Dhaam Teaser : హెబ్బాప‌టేల్ ‘ధూం ధాం’ టీజ‌ర్ రిలీజ్‌.. మారుతి చేతుల మీదుగా..

నిజానికి అలా ఉండదు హీరోయిన్స్ వచ్చి వాళ్ల పని వాళ్లు చేసుకొని వెళ్ళిపోతారు. హాయ్ అంటే హాయ్ అంటారు. ఏదన్నా పనుంటే మాట్లాడతారు. ప్రొడ్యూసర్స్ పనేంటంటే హీరోయిన్స్ డేట్స్ అడుక్కోడం అంతే.. మాకు హీరోయిన్స్ తో అదే పని ఉంటుంది. అంతకు మించి ఏం ఉండదు అంటూ చెప్పారు. దీంతో నాగవంశీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న లక్కీ భాస్కర్ సినిమా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నారు.