Dhoom Dhaam Teaser : హెబ్బాపటేల్ ‘ధూం ధాం’ టీజర్ రిలీజ్.. మారుతి చేతుల మీదుగా..
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మూవీ ధూం ధాం

Hebah Patel Dhoom Dhaam Teaser out
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మూవీ ‘ధూం ధాం’. సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. నవంబర్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టింది. ఈ చిత్ర టీజర్ ను దర్శకుడు మారుతి చేతుల విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ధూం ధాం చిత్ర టీజర్ బాగుందన్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయన్నారు. చిత్ర బృందానికి ఆల్‌ది బెస్ట్ చెప్పారు.
Blockbuster @DirectorMaruthi Garu launched the TEASER of #DhoomDhaam#DhoomDhaam Teaser Out Now!
In theatres November 8th#DhoomDhaamOnNov8
pic.twitter.com/S3JztgCor3— Suresh PRO (@SureshPRO_) October 22, 2024
ఓ మంచి లవ్‌స్టోరీతో పాటు తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ బాండింగ్ ఈ చిత్రంలో చూపించనున్నట్లుగా టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. వెన్నెల కిశోర్ కామెడీ ట్రాక్ సూపర్‌గా ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ విడుదల కానుంది.