Nagababu : చిరంజీవి మీద కానీ, ఆయన ఫ్యామిలీ మీద కానీ ఈగ వాలినా ఊరుకోము..
నాగబాబు మాట్లాడుతూ.. మెగా ఫ్యాన్స్ అనేది ఒక ఆర్గనైజేషన్. ఇక్కడే కాదు ఇండియాలో కూడా ఏ హీరోకి ఇంత పవర్ ఫుల్ ఆర్గనైజేషన్ లేదు. చిరంజీవి గారి మీద కానీ, ఆయన ఫ్యామిలీ మీద కానీ ఈగ వాలినా.............
- Saketh U
- Published On : December 27, 2022 / 02:24 PM IST
Nagababu sensational comments in Mega Fans Meet
Nagababu : ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజాలో మెగా ఫ్యాన్స్ సమావేశం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి కూడా పలువురు మెగా ఫ్యాన్స్ ఈ సమావేశానికి వచ్చారు. ఈ సమావేశంలో వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ గురించి, థియేటర్స్ ఇష్యూ గురించి చర్చించారు. ఈ సమావేశానికి వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ, మెగా బ్రదర్ నాగబాబు, సినిమా నిర్మాత రవి కూడా హాజరయ్యారు.
ఈ సమావేశంలో డైరెక్టర్ బాబీ సినిమా గురించి మాట్లాడాడు, సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందన్నారు. అలాగే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 8న నిర్వహిస్తామని, సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేస్తామని ప్రకటించారు నిర్మాతలు. ఇక నాగబాబు మాట్లాడుతూ, ఫ్యాన్స్, సమస్యల గురించి కూడా మాట్లాడారు.
Mega Fans Meet : మీరేమి భయపడక్కర్లేదు.. మెగా ఫ్యాన్స్ మీట్ లో డైరెక్టర్ బాబీ, మెగా బ్రదర్ నాగబాబు..
నాగబాబు మాట్లాడుతూ.. మెగా ఫ్యాన్స్ అనేది ఒక ఆర్గనైజేషన్. ఇక్కడే కాదు ఇండియాలో కూడా ఏ హీరోకి ఇంత పవర్ ఫుల్ ఆర్గనైజేషన్ లేదు. చిరంజీవి గారి మీద కానీ, ఆయన ఫ్యామిలీ మీద కానీ ఈగ వాలినా ఎంత దూరం వెళ్లడానికైనా సిద్దమైన అభిమానులు ఉన్నారు. చిరంజీవి గారు ఎలాంటి కాంట్రవర్సీలకి వెళ్ళరు. చాలా సైలెంట్ గా అందర్నీ గౌరవిస్తూ ఉంటారు. అలా ఉన్నారు కదా అని ఎవరైనా ఆయన్ని అంటే మెగా అభిమానులు ఊరుకోరు. నేనైతే ఆయన్ని ఏమన్నా అంటే మెగా అభిమానిగా ఊరుకోను. కాకపోతే నేను ఎక్కువగా ఏమన్నా మాట్లాడితే శాంతి బధ్రతలకి విఘాతం కలుగుతుందని సైలెంట్ గా ఉంటాను అని అన్నారు. దీంతో నాగబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
