Nagarjuna Annapurna Studios linkup with Allu Arjun Pushpa 2 movie
Pushpa 2 : అక్కినేని నాగార్జున గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఆయన కుబేర సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక అక్కినేని నాగ చైతన్య ఎంగేజ్ మెంట్ అయినప్పటి నుండి నాగార్జునను సోషల్ మీడియాలో ఫాన్స్ ఎక్కువ ట్రెండ్ చేస్తున్నారు. చైతు పెళ్లి ఎప్పుడని, ఎక్కడ చేస్తారని రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. చైతు, శోభిత పెళ్లి చాలా సింపుల్ గా జరగనుందని నాగ్ అందరికి క్లారిటీ ఇచ్చారు.
Also Read : Rocking Rakesh : తన సినిమా టికెట్స్ తానే అమ్మిన రాకింగ్ రాకేష్
అయితే తాజాగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్నారు ఆయన. ఇక ఇందులో చాలా విషయాలను తెలిపారు. అలాగే భారతదేశంలో డాల్బీ విజన్‌ని పరిచయం చేస్తునట్టు ఆయన ఈ సందర్బంగా తెలిపారు.ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. మా ఫ్యామిలీ మేమందరం కలిసి నిర్ణయించుకున్నాం.. మా అన్నపూర్ణ స్టూడియో లో డాల్బీ సినిమా, డాల్బీ విజన్ తీసుకొస్తున్నాం. పుష్ప 2 సినిమాతో దీన్ని లాంచ్ చేస్తామని నాగ్ తెలిపారు. అంతేకాదు ఇండియాలోనే ఇది మొదటి డాల్బీ సినిమా అని, ఇప్పటికే డాల్బీ కి సంబందించిన వారు వచ్చి ఇక్కడి పరిస్థితులను చూసారని, ఇక్కడున్న ఫెసిలిటీస్ వాళ్ళకి నచ్చి ఫైనల్ చేసారని. ఇకపై డాల్బీ సినిమా ఎవరికైనా కావాలంటే మాదగ్గరికే రావాలని తెలిపారు నాగ్.
. @iamnagarjuna garu
spoke about his vision with annapurna studios introducing Dolby Vision in India with #Pushpa2TheRule 💥💥🥵🥵~ At International film festival of india @alluarjun #Pushpa2 @PushpaMovie pic.twitter.com/cJrNMKCRgN
— Allu Arjun TFC™ (@AlluArjunTFC) November 22, 2024
పుష్ప 2 సినిమాతో అన్నపూర్ణ స్టూడియోలో డాల్బీ సినిమా, డాల్బీ విజన్ అందుబాటులోకి వస్తుండడంతో.. సినీ ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు ప్రేక్షకులు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.