Nagarjuna clarified Naga Chaitanya becoming father news.
Nagarjuna: సోషల్ మీడియాలో కొంతకాలంగా నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఇదే విషయాన్ని నాగ చైతన్య తండ్రి నాగార్జునను అడిగారు రిపోర్టర్స్. దానికి సమాధానంగా నాగార్జున మాట్లాడుతూ “సమయం వచ్చినప్పుడు మేమె చెప్తాము” అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో నాగార్జునకి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. నాగార్జున(Nagarjuna) చెప్పున సమాధానాన్ని తప్పుగా అర్థంచేసుకున్న కొంతమంది నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడు అనే వార్తలను మళ్ళీ వైరల్ చేయడం మొదలుపెట్టారు.
Naga Chaitanya: శోభిత-సమంతతో నాగ చైతన్య.. వైరల్ అవుతున్న పిక్
ఈ విషయంపై తాజాగా మరోసారి స్పందించాడు నాగార్జున. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ తన కోడలు శోభితపై ప్రశంసలు కురిపించాడు. తండ్రి కావడం అనేది, ఒక కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది ఎవరికైనా చాలా స్పెషల్ మూమెంట్. ఇలాంటి విషయాల గురించి వార్తలు రాసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం మంచిది. శోభిత మా ఇంట్లో అడుగుపెట్టాక ఎంతో సంతోషం వచ్చింది. తాను ప్రతీ విషయంలో చాలా పాజిటీవ్ గా ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం తనది. తన రాకతో మా జీవితాలు సంతోషంతో కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం నాగ చైతన్య, శోభిత తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. తాతయ్యను చేసే గుడ్ న్యూస్ ఏదైనా ఉంటే మేమె స్వయంగా ప్రకటిస్తాము”అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. దీంతో, నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పడింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. నాగ చైతన్య ప్రస్తుతం వృషకర్మ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడికల్ అండ్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమా హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ కి ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.