Nagarjuna : బిగ్‌బాస్ కంటెస్టెంట్ గా మాత్రం వెళ్ళను.. అది అంత ఈజీ కాదు.. నేను ఎవర్నీ ఉద్దేశించి ఆ మాట అనలేదు..
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ.. ''నేను ఎవరైనా జోక్ వేస్తే ‘నారాయణ నారాయణ’ అంటాను. మొన్న శనివారం ఎపిసోడ్‌లో కూడా కంటెస్టెంట్స్ ని నవ్వించడానికే అలా అన్నాను. బిగ్‌బాస్ లో గతంలో..............
- Saketh U
- Published On : September 14, 2022 / 01:59 PM IST
Nagarjuna comments on BiggBoss and gives clarity ona Narayana Issue
Nagarjuna : టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ పక్క టీవీ షోలు, ఓ పక్క సినిమాలతో బిజీగా ఉన్నారు. 60 ఏళ్ళ వయసులో కూడా మన్మథుడిలా యంగ్ గా కనిపిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఇటీవలే బ్రహ్మాస్త్ర సినిమాలో గెస్ట్ పాత్రలో నటించి అందర్నీ ఆకట్టుకున్నారు నాగార్జున. త్వరలో ఘోస్ట్ సినిమాతో రాబోతున్నారు. తాజాగా బ్రహ్మస్త్ర సినిమా సక్సెస్ మీట్ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలని చేశారు.
నాగార్జున ఈ ఇంటర్వ్యూలో తన వందో సినిమా, బాయ్ కాట్ ట్రెండ్, కొత్త కథలు, వెబ్ సిరీస్ లు, బిగ్ బాస్ గురించి.. ఇలా పలు అంశాలపై స్పందించారు. బిగ్‌బాస్ పై గతంలో, ఇటీవల సీపీఐ లీడర్ నారాయణ దారుణమైన విమర్శలు చేశారు. బిగ్‌బాస్ ని, నాగార్జునని తిట్టారు. అయితే దీనిపై నాగార్జున మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా హౌస్ లో ఓ సన్నివేశంలో నాగార్జున నారాయణ.. నారాయణ అనడంతో సీపీఐ లీడర్ నారాయణనే అన్నారని, కౌంటర్ వేశారని అంతా భావించారు.
Bandla Ganesh : మా పవన్ కళ్యాణ్ ని చూసి నేర్చుకోండి.. యువ హీరోలకి కౌంటర్ వేసిన బండ్ల గణేష్..
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ.. ”నేను ఎవరైనా జోక్ వేస్తే ‘నారాయణ నారాయణ’ అంటాను. మొన్న శనివారం ఎపిసోడ్‌లో కూడా కంటెస్టెంట్స్ ని నవ్వించడానికే అలా అన్నాను. బిగ్‌బాస్ లో గతంలో కూడా కొన్ని సార్లు ఆ మాట వాడాను. అంతే కానీ నేను ఎవర్నీ ఉద్దేశించి ‘నారాయణ నారాయణ’ అనలేదు” అని అన్నారు.
ఇక బిగ్‌బాస్ హౌస్ గురించి మాట్లాడుతూ.. ”బిగ్‌బాస్ లో ఎవరు డ్రామా చేస్తున్నారు? ఎవరు గేమ్స్ ఆడుతున్నారు? అని విశ్లేషిస్తుంటే నాకు లైఫ్ లెసెన్స్‌లా అనిపిస్తోంది. మన కుటుంబాన్ని వదిలేసి, వందల కెమెరాల మధ్య, తెలియని వ్యక్తుల మధ్య అన్ని రోజులు గడపడం అనేది చిన్న విషయం కాదు. నేను హోస్ట్ గా చేస్తాను కానీ, పార్టిసిపెంట్ గా మాత్రం బిగ్‌బాస్ లోకి వెళ్ళను, వెళ్ళలేను” అని అన్నారు.
