Mahesh Babu – Nagarjuna : మహేష్ బాబు పై అక్కినేని ఫ్యాన్స్ ఫైర్.. నాగార్జున వీడియోతో..!
నాగార్జున, మహేష్ బాబు అభిమానుల మధ్య సోషల్ మీడియా ఫైట్. మహేష్ ట్వీట్ పై అక్కినేని ఫ్యాన్స్.
- gum 95921
- Published on- August 30, 2023 / 05:51 PM IST
Nagarjuna fans angry on Mahesh Babu Tweet video viral
Mahesh Babu – Nagarjuna : టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టినరోజు నిన్న ఆగష్టు 29న జరిగిన సంగతి తెలిసిందే. ఇక నాగ్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఇండస్ట్రీలోని ప్రముఖులంతా సోషల్ మీడియాలో పోస్టులు వేశారు. ఈక్రమంలోనే మహేష్ బాబు చేసిన పోస్ట్ అక్కినేని అభిమానులను హర్ట్ చేసింది. “హ్యాపీ బర్త్ డే నాగార్జున” అంటూ ఏకవచనంతో విష్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
‘నాగార్జున మీకన్నా సీనియర్ కదా..? పేరు పక్కన సార్ లేదా గారు అని పెట్టి మర్యాద ఇస్తే బాగుండేది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మహేష్ బాబు, నాగ్ అభిమానులు మధ్య సోషల్ మీడియాలో ఒక డిబెట్ మొదలైంది. ఈక్రమంలోనే ఒక మహేష్ అభిమాని గతంలో నాగార్జున ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఒక వీడియోని షేర్ చేయగా గొడవ కొంచెం సద్దుమణిగినట్లు అయ్యింది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఊపిరి మూవీ టైంలో నాగార్జున ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మహేష్ బాబు ఫోన్ కాల్ గురించి తెలియజేశాడు. ఈక్రమంలోనే మహేష్ తనని ‘నాగ్’ అంటూ ఏకవచనంతోనే పిలుస్తాడు అని తెలియజేశాడు. ఈ వీడియోని షేర్ చేస్తూ.. వారిద్దరి మధ్య అంతటి స్నేహం ఉంది కాబట్టే మహేష్ బాబు అలా ఏకవచనంతో ట్వీట్ చేశాడని సూపర్ స్టార్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఒకసారి మీరుకూడా ఆ వీడియో చూసేయండి.
ప్రస్తుతం ఈ వీడియో పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక నాగార్జున కొత్త సినిమా విషయానికి వస్తే.. ‘నా సామిరంగ’ అనే మాస్ టైటిల్ తో తన 99వ సినిమాని ప్రకటించాడు. ఎటువంటి ప్రచారం లేకుండా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ గ్లింప్స్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశాడు. అయితే ఈ మూవీ ఒక మలయాళ చిత్రానికి రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. 2019లో రిలీజ్ అయిన ‘పోరింజు మరియం జోస్’ (Porinju Mariam Jose) అనే సినిమాకి ఇది రీమేక్ గా వస్తుందట.
