Nagarjuna : వామ్మో.. బిగ్ బాస్ సీజన్ 10కి నాగార్జున రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?

మూడో సీజన్ నుంచి ఇప్పటివరకు నాగార్జుననే హోస్ట్ చేస్తున్నారు. (Nagarjuna)

  • Published on- July 7, 2026 / 06:31 PM IST

Nagarjuna

Nagarjuna : తెలుగులో బిగ్ బాస్ ఇప్పటికే 9 సీజన్లు పూర్తి చేసుకొని పదో సీజన్ త్వరలో మొదలు కాబోతుంది. ఈ బిగ్ బాస్ ని తిట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసే వాళ్ళు, అందులో కంటెస్టెంట్స్ ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. బిగ్ బాస్ షో ఫైనాన్షియల్ గా కూడా చాలా సంపద సృష్టిస్తుంది. అందుకే ఇందులో పాల్గొనే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కు కూడా భారీగా రెమ్యునరేషన్స్ ఇస్తారు. హోస్ట్ కి ఇంకా ఎక్కువే ఇస్తారు.

తెలుగు బిగ్ బాస్ కి మొదటి సీజన్ ఎన్టీఆర్, రెండో సీజన్ నాని హోస్ట్ చేయగా మూడో సీజన్ నుంచి ఇప్పటివరకు నాగార్జుననే హోస్ట్ చేస్తున్నారు. అప్పట్లో బిగ్ బాస్ సీజన్ 3 కి నాగార్జున 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అది చాలా పెరిగింది. బిగ్ బాస్ బ్రాండ్ వ్యాల్యూ పెరగడంతో నాగార్జున రెమ్యునరేషన్ కూడా పెరిగింది.

Also Read : Pritam and Pedro : ‘ప్రీతమ్ అండ్ పెద్రో’ వెబ్ సిరీస్ రివ్యూ.. బాలీవుడ్ క్రైమ్ కామెడీ.. హీరోగా ఎంట్రీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ కొడుకు..

ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10కి నాగార్జున దాదాపు 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాలీవుడ్ సమాచారం. గత సంవత్సరం 35 కోట్లు తీసుకున్నారని, ఈసారి మరో 5 కోట్లు పెంచారని తెలుస్తుంది. 15 వారాల పాటు ఈ బిగ్ బాస్ సాగుతుంది. వారానికి రెండు రోజులు శని, ఆది వారాలు హోస్ట్ వస్తారు. అంటే ఆల్మోస్ట్ 30 రోజులు నాగార్జున ఈ షోలో పాల్గొంటారు. 30 రోజులకు కాను నాగార్జున 40 కోట్లు తీసుకుంటున్నారు అని తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

మరి ఈసారి బిగ్ బాస్ సీజన్ 10 కి కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తారు? ఎలా సాగుతుంది? విన్నర్ ఎవరు అవుతాడు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్.