Akhil Akkineni: ‘లెనిన్’ రీ షూట్ చేస్తున్నారా.. సినిమా చూసి నాగార్జున మార్చమన్నాడట.. మరి రిలీజ్ సంగతేంటో?
అఖిల్ అక్కినేని(Akhil Akkineni) హీరోగా వస్తున్న లెనిన్ సినిమాలో కొన్ని సీన్స్ ను రీ షూట్ చేస్తున్నారు.
- V Santhosh Kumar
- Published on- April 26, 2026 / 09:27 AM IST
Nagarjuna suggested reshooting certain scenes in Akkineni Akhil Lenin movie
- అఖిల్ హీరోగా వస్తున్న లెనిన్ మూవీ
- సినిమా చూసి చిన్న చిన్న మార్పులు చెప్పిన నాగార్జున
- రిలీజ్ దగ్గరలో రీ షూట్ చేస్తున్న టీం
Akhil Akkineni: అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. వరుస పరాజయాల తర్వాత ఈ సినిమాతో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని అఖిల్ గట్టి పట్టుదలతో ఉన్నాడు. అందుకే ఈ ప్రాజెక్ట్ విషయంలో అక్కినేని నాగార్జున స్వయంగా రంగంలోకి దిగి, సినిమా అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను చూసిన నాగార్జున, అవి ఇంకాస్త ప్రభావవంతంగా ఉండాలని భావించి రీషూట్స్ చేయాలని చిత్ర బృందాన్ని ఆదేశించినట్లు సమాచారం.
Mega 158: మెగా 158 నిర్మాతలకు చిరు అదిరిపోయే ఆఫర్.. బ్యాకప్ కోసం పక్కా ప్లాన్
నాగార్జున సూచనల మేరకు ప్రస్తుతం ‘లెనిన్’ టీమ్ రీషూట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నెలాఖరులోగా పెండింగ్ ఉన్న షూటింగ్, రీషూట్ భాగాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట టీం. సినిమాలోని పాటలు ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకోవడంతో, సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. తండ్రి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ మార్పులు ఖచ్చితంగా సినిమా స్థాయిని పెంచుతాయని, అఖిల్‌కు ఇది సరైన కంబ్యాక్ మూవీ అవుతుందని అక్కినేని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, బాక్సాఫీస్ వద్ద పోటీని దృష్టిలో ఉంచుకుని విడుదల తేదీని మార్చే యోచనలో మేకర్స్ ఉన్నారు. జూన్ 25న ‘పెద్ది’ సినిమా విడుదల కానుండటంతో, క్లాష్ అవ్వకుండా ఉండేందుకు ‘లెనిన్’ కోసం కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆలస్యం జరుగుతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. మొత్తానికి అఖిల్ (Akhil Akkineni)ఆశలన్నీ ఈ ‘లెనిన్’ పైనే ఉన్నాయి, ఇది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి.
