NagaVamsi : ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన నాగవంశీ.. వార్ 2 తెలుగు సినిమా.. ఎన్టీఆర్ అన్న పవర్ ఇండియా అంతా తెలిసేలా చేయాలి..

ఈ వ్యాఖ్యలకు నాగవంశీ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో సమాధానమిచ్చాడు.

NagaVamsi

NagaVamsi : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబోలో బాలీవుడ్ లో భారీగా తెరకెక్కుతున్న స్పై సినిమా వార్ 2 ఆగస్టు 14న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. నేడు వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. భారీగా అభిమానుల మధ్య ఈవెంట్ ని నిర్వహించారు.

ఈ సినిమాని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తున్నారు. సితార నిర్మాత నాగవంశీ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వార్ 2 సినిమాపై పలువురు ఇది హిందీ డబ్బింగ్ సినిమా, ఎన్టీఆర్ కీలక పాత్ర అని, తెలుగులో డబ్బింగ్ అయి రిలీజవుతుంది, కూలీ పై ఉన్న అంచలనాతో వార్ 2 ప్రమోషన్స్ ఎక్కువ చెయ్యట్లేదు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు నాగవంశీ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో సమాధానమిచ్చాడు.

Also Read : Athamma`s Kitchen : అత్తమ్మాస్ కిచెన్ ఎలా మొదలైందో తెలుసా? చరణ్ అర్ధరాత్రి వచ్చి అలా అడుగుతుండటంతో..

నాగవంశీ మాట్లాడుతూ.. అన్న ఎన్టీఆర్ ని హిందీ సినిమాకు తీసుకెళ్లినట్టు లేదు. హృతిక్ ని తెలుగు సినిమాకు తీసుకొచ్చినట్టు ఉంది కదా వైబ్. రేపు సినిమా కూడా అలాగే ఉంటుంది. ఎవరైనా హిందీ డబ్బింగ్ సినిమా అని అంటే ఇదే చెప్పండి. లిప్ సింక్ తో సహా ప్రాపర్ గా ఉంటుంది. ఇది తెలుగు సినిమా. తెలుగు దర్శకులు కంటే అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ ని బాగా చూపించారు. ఇది ప్రాపర్ తెలుగు సినిమా. హృతిక్ ని తెలుగు ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాం. ఎన్టీఆర్ అన్న పవర్ ఇండియా అంతా చూపించాలి అంటే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి.

దేవర కంటే ఎక్కువ ఓపెనింగ్స్ తేవాలి. హిందీ కలెక్షన్స్ కంటే మనది ఒక్క రూపాయి అయినా ఎక్కువ ఉండాలి. ఇన్నాళ్లు అన్న మన కోసం కాలర్ ఎగరేశారు. మనం ఇపుడు అన్న ఇండియాలో కాలర్ ఎగిరేసేలా చేయాలి. మీరు అడిగినట్టు సినిమాని తీసుకికొచ్చాం, గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది. సినిమా చాలా బాగుంది. సినిమా బాగోకపోతే నన్ను పది రెట్లు తిట్టండి. మీకు తెలుగు సినిమా చూసినట్టు అనిపించకపోతే ఇంకెప్పుడు సినిమా చూడమని మైక్ పట్టుకొని మళ్ళీ అడగను అని అన్నారు. దీంతో నాగవంశీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : Upasana : రామ్ చరణ్ కి ఉపాసన పెట్టిన లవ్ టెస్ట్ ఇదే అంట.. డేటింగ్ లో ఉన్నప్పుడు అక్కడికి తీసుకెళ్లమని..