Nainika
Nainika : డ్యాన్స్ షో ఢీతో ఫేమ్ తెచ్చుకున్న నైనిక ఆ తర్వాత సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించింది. బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొని నైనిక మరింత గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక టీవీ షోలు, ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ డ్యాన్స్ మాస్టర్ గా, ఆర్టిస్ట్ గా ప్రయత్నాలు చేస్తుంది నైనిక.(Nainika)
తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో సూసైడ్ ప్రయత్నం కూడా చేశాను అని తెలిపింది.
Also Read : Naresh Vasuki : మొన్నేమో తండ్రీకూతుళ్లుగా.. ఇప్పుడేమో భార్యాభర్తలుగా.. ఎలా మెప్పిస్తారో ఈ కాంబో..?
నైనికా మాట్లాడుతూ.. ఢీ షో ఎండింగ్ టైంలో సూసైడ్ అటెంప్ట్ చేశాను. నా ఫీలింగ్స్ ఎవరూ అర్ధం చేసుకోలేదు. నేను అందరికి చెప్పాలని చూశాను కానీ నన్ను ఎవరూ అర్ధం చేసుకోలేదు. కొన్ని సార్లు అబ్యూజ్ మనం భరించాలి అన్నట్టు ఉండిపోయింది ఇక్కడ. నాకు అది ఓకే కాదు. నేను దాని మీద ఫైట్ చేశాను. ఒక పది పన్నెండు మంది ముందు నన్ను నేనే తిట్టుకున్నా, ఏడ్చాను. ఒక మూడు నాలుగు నెలలు నేనేం ఏం చేస్తున్నానో నాకే తెలీదు. అడ్జస్ట్ అవ్వాలి అనుకున్నా. కానీ మెంటల్లీ సఫర్ అయ్యాను దానివల్ల. అందుకే అలా చేశాను అని తెలిపింది.