నమ్రత మేకప్ పై ట్రోలింగ్స్ : బుద్ధి మార్చుకోవాలంటూ వార్నింగ్స్

సోషల్ మీడియాలో తనని కామెంట్ చేసిన ఆకతాయికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సూపర్ స్టార్ వైఫ్..

  • Publish Date - May 11, 2019 / 01:36 PM IST

సోషల్ మీడియాలో తనని కామెంట్ చేసిన ఆకతాయికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సూపర్ స్టార్ వైఫ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, అశ్వినీదత్, దిల్ రాజు, పివిపి కలిసి నిర్మించిన మహర్షి.. మే 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఉదయం ఆటనుండే పాజిటివ్ టాక్‌తో, అన్నిచోట్లా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తుందీ సినిమా… ఈ సందర్భంగా మహేష్, వంశీ పైడిపల్లి తమ ఫ్యామిలీస్‌తో కలిసి సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకున్నారు. తమ సెలబ్రేషన్‌కి సంబంధించిన ఫొటోలను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చూసి, ఒక ఆకతాయి చేసిన కామెంట్‌కి నమ్రత ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

మహర్షి సక్సెస్ సెలబ్రేషన్ పిక్‌లో నమ్రతను చూసి ఒక వ్యక్తి : ‘నమ్రత నువ్వు ఎందుకు మేకప్ వేసుకోవు? ఏదో డిప్రెషన్‌తో బాధ పడుతున్నట్టున్నావ్’.. అని కామెంట్ చేసాడు. అతగాడు చేసిన వెకిలి కామెంట్‌కి నమ్రత అంతే స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చింది.. ‘నీకు ఎప్పుడూ మేకప్ వేసుకునే వాళ్ళే నచ్చుతారనుకుంటా, నీ టేస్ట్‌కి తగ్గట్టు అలాంటి వాళ్ళనే ఫాలో అవ్వు, ఈ పేజీలో అలాంటివారెవరూ ఉండరు, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే.. నువ్విది వదిలేస్తే మంచిది’.. అంటూ చెంప పగలగొట్టినట్టు కౌంటర్ ఇచ్చింది. ఈ విషయం కాస్తా వైరల్ అయ్యింది. ప్రస్తుతం నమ్రతకి సపోర్ట్‌గా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

నమ్రత మేకప్ విషయం, డిప్రెషన్ ఇష్యూపై సోషల్ మీడియా ట్రోల్ చేయటం మొదలుపెట్టింది. దీనికి నమ్రతతోపాటు సూపర్ స్టార్ మహేష్ అభిమానులు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఆడవారిని చూసే ధోరణి మారాలని.. కేవలం అందమే కాదు.. మనస్సు కూడా చూడాలంటూ నెటిజన్లకు చురకలు అంటిస్తున్నారు. మేకప్ లేకపోతే చూడలేరా అంటూ మరికొందరు ప్రశ్నించారు. ఇలాంటి చీప్ మెంటాలిటీ వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు మరికొందరు. నమ్రతకు మద్దతుగా నెటిజన్లు ఎక్కువ మంది స్పందిస్తున్నారు.