Balakrishna – Koratala Siva : సెన్సేషనల్ కాంబినేషన్!
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోయే సినిమాకు కథా చర్చలు జరుగుతున్నాయి..

Nbk 109
Balakrishna – Koratala Siva: నటసింహా నందమూరి బాలకృష్ణ వయసు 61 అయినా తానింకా స్వీట్ 16 ఏ నంటూ చెప్తున్నట్లుగానే అంతే స్పీడ్‌గా సినిమాలు లైనప్ చేస్తున్నారు. ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’ రిలీజ్‌కి రెడీ అవుతోంది.
Pushpa The Rise : ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటున్న అల్లు అర్జున్..
ఇంతలో ‘క్రాక్’ తో బ్లాక్‌బస్టర్ కొట్టిన గోపిచంద్ మలినేనితో మైత్రీ మూవీ మేకర్స్‌లో సినిమా స్టార్ట్ చేసేశారు. తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చెయ్యబోతున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తోనూ సినిమా ఉంది. ఇంతలో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ చేసినట్లు ఫిలిం సర్కిల్స్‌లో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
Sai Dharam Tej : సెవన్ ఇయర్స్ ఫర్ సుప్రీం హీరో..
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చెయ్యబోతున్నారని.. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్, కొరటాల శివ స్నేహితుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా ప్రొడ్యూసర్ సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మించనున్నారని సమాచారం. త్వరలో ఈ సెన్సేషనల్ కాంబినేషన్‌లో మూవీ అఫీషియల్‌గా అనౌన్స్ చెయ్యబోతున్నారు.
Naatu Naatu Song : డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ! వీడియో వైరల్..