శాతకర్ణి – సైరా సరదా సంభాషణ : టు స్టార్స్ ఇన్ వన్ ఫ్రేమ్
చాలా రోజుల తర్వాత చిరు, బాలయ్య ఇద్దరినీ కలిసి చూసిన వారి అభిమానులు ఈ ఫోటోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేసేస్తున్నారు..

చాలా రోజుల తర్వాత చిరు, బాలయ్య ఇద్దరినీ కలిసి చూసిన వారి అభిమానులు ఈ ఫోటోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేసేస్తున్నారు..
వెండితెరపై ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు ఏ స్థాయి పోటీ ఉంటుందో, వారి అభిమానుల మధ్య ఎంతటి వాదోపవాదాలు, చర్చలు జరుగుతాయో తెలిసిందే.. ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో వీరి మధ్య చర్చలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. తెర ముందు పోటీ సంగతి ఎలా ఉన్నా.. తెర వెనుక మాత్రం హీరోలంతా స్నేహితుల్లానే ఉంటారు.
మరీ ముఖ్యంగా నటసింహ నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పుకోవాలి. వీరిరువురూ మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. సినిమాల విషయంలో తమ మధ్య ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉంటుందని, సినిమా పరిశ్రమలో తాను అత్యంత సన్నిహితంగా ఉండేదీ, తనకున్న ఏకైక స్నేహితుడూ చిరంజీవే అని బాలయ్య పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.
Read Also : కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థ వేడుకలో తారా లోకం!
రీసెంట్‌గా చిరు, బాలయ్య.. స్వర్గీయ.. కోడి రామకృష్ణ గారి రెండో కుమార్తె కోడి ప్రవల్లిక నిశ్చితార్థ వేడుకలో కలిశారు. ఆ సందర్భంగా ఇద్దరూ పక్కపక్కన కూర్చుని కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. చాలా రోజుల తర్వాత చిరు, బాలయ్య ఇద్దరినీ కలిసి చూసిన వారి అభిమానులు ఈ ఫోటోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేసేస్తున్నారు.