Happy Janmashtami 2025 : హ్యాపీ జన్మాష్టమి 2025.. వాట్సాప్ స్టేటస్ వీడియో డౌన్‌లోడ్ చేసి మీకు ఇష్టమైన వారికి ఇలా షేర్ చేయండి!

Happy Janmashtami 2025 : జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని వీడియోలను స్టేటస్ వీడియోలుగా క్రియేట్ చేయాలని అనుకుంటున్నారా?

Happy Janmashtami 2025 : హ్యాపీ జన్మాష్టమి 2025.. వాట్సాప్ స్టేటస్ వీడియో డౌన్‌లోడ్ చేసి మీకు ఇష్టమైన వారికి ఇలా షేర్ చేయండి!

Happy Janmashtami 2025

Updated On : August 16, 2025 / 2:05 PM IST

Happy Janmashtami 2025 : శ్రీకృష్ణుడు పుట్టినరోజు పండుగ జన్మాష్టమిగా పిలుస్తారు. దేశమంతటా అత్యంత ప్రతిష్టాత్మకమైన వేడుకలలో ఇదొకటి. ఈ జన్మాష్టమి సందర్భంగా (Happy Janmashtami 2025) అనేక మంది భక్తులు ఉపవాసాలు పాటిస్తారు.

దేవాలయాలు, ఇళ్లను అలంకరిస్తారు, భక్తి పాటలు పాడతారు. ప్రార్థనలు, ఆచారాలతో కృష్ణుడిని స్వాగతించేందుకు అర్ధరాత్రి వరకు వేచి ఉంటారు. రంగురంగుల దహి హండి కార్యక్రమాల నుంచి భజనల వరకు అన్ని ఏర్పాటు చేస్తారు.

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి ఒకచోట చేరి ఉట్టి కొట్టడం వంటి ఆటలను ఆడుతారు. ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ జన్మా్ష్టమి పండుగ రోజున నేటి డిజిటల్ ప్రపంచంలో పండుగ ఉత్సాహాన్ని మరింతగా సెలబ్రేట్ చేసుకోవచ్చు.

Read Also : UPI Users : UPI యూజర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఈ ఫీచర్ ఖతం.. మీ మంచి కోసమే..!

జన్మాష్టమి బ్యాక్‌గ్రౌండ్ వాట్సాప్ స్టేటస్ వీడియోను స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయొచ్చు. ఇంతకీ ఈ వాట్సాప్ వీడియోలను ఎలా క్రియేట్ చేయాలి? ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఎలా వాట్సాప్ స్టేటస్ వీడియోగా అప్ లోడ్ చేయాలి అనే పూర్తి గైడ్ మీకోసం అందిస్తున్నాం.

1. YouTube నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి :

  • యూట్యూబ్ జన్మాష్టమి వీడియోలతో సహా ఫెస్టివల్ కంటెంట్ అందిస్తుంది.
  • యూట్యూబ్ ఓపెన్ చేసి “Happy Krishna Janmashtami 2025” అని సెర్చ్ చేయండి.
  • మీకు నచ్చిన వీడియోను ఎంచుకుని షేర్ ఆప్షన్‌ను ట్యాప్ చేసి లింక్‌ను Copy చేయండి.
  • YouTube డౌన్‌లోడ్ వెబ్‌సైట్ లేదా యాప్‌కి వెళ్లండి.
  • ఆ లింక్‌ను Paste చేసి MP4 ఫార్మాట్‌ను ఎంచుకోండి. ఆపై డౌన్‌లోడ్ చేసుకోండి.
  • మీ ఫోన్‌లో సేవ్ చేశాక నేరుగా వాట్సాప్‌లో అప్‌లోడ్ చేసుకోండి.

2. ఫెస్టివల్ కంటెంట్ వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి :

  • అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల్లో ఫ్రీ, హైక్వాలిటీ వాట్సాప్ స్టేటస్ వీడియోలు పొందవచ్చు.
  • “Happy Krishna” కోసం ఆన్‌లైన్‌లో జన్మాష్టమి 2025 వాట్సాప్ స్టేటస్ వీడియో డౌన్‌లోడ్” సెర్చ్ చేయండి.
  • Pexels, Pinterest లేదా ఇతర ఫెస్టివల్ వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ల వంటి సైట్‌లను సెర్చ్ చేయండి.
  • కలెక్షన్ బ్రౌజ్ చేయండి. మీకు ఇష్టమైన జన్మాష్టమి వీడియోను ఎంచుకుని MP4 ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి.

3. మీ జన్మాష్టమి వీడియో వాట్సాప్‌లో అప్‌లోడ్ చేయండి :

  • వాట్సాప్ ఓపెన్ చేసి అప్‌డేట్స్ ట్యాబ్‌కి వెళ్లండి.
  • స్టేటస్ సెక్షన్‌లో మీ ప్రొఫైల్ ఫోటోపై “+” ఐకాన్ ట్యాప్ చేయండి.
  • గ్యాలరీ నుంచి మీరు సేవ్ చేసిన జన్మాష్టమి వీడియోను ఎంచుకోండి.
  • గ్రీన్ కలర్ Send బటన్‌ను ట్యాప్ చేయండి.