Nandamuri Balakrishna : షూటింగ్‌లో ప్ర‌మాదం.. బాల‌య్య బాబుకు గాయం.. ఆందోళ‌న‌లో అభిమానులు!

సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్‌లో (Nandamuri Balakrishna ) గాయ‌ప‌డ్డారు.

Nandamuri Balakrishna injured nbk 111 movie shootin at kakinada

Nandamuri Balakrishna : సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డారు. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న హీరోగా న‌టిస్తున్నారు. #NBK111 వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ కాకినాడ పోర్టులో జ‌రుగుతోంది.

న‌టుడు మంచు మ‌నోజ్, బాల‌కృష్ణ ల‌ మ‌ధ్య కీల‌క యాక్ష‌న్ సీక్వెన్స్ చిత్రీక‌రిస్తుండ‌గా ప్ర‌మాదం చోటు చేసుకుంది. బాల‌య్య మోకాలికి స్వ‌ల్ప గాయ‌మైంది. వెంట‌నే చిత్ర బృందం షూటింగ్‌ను నిలిపివేసి ఆయ‌న్ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

Toxic : టాక్సిక్‌ నుంచి మ‌రో సాంగ్‌ వ‌చ్చేసింది.. ‘మ‌న‌సాగ‌దే..’

వీర సింహారెడ్డి త‌రువాత గోపిచంద్, బాల‌య్య కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ కావ‌డంతో ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. వృద్ధి సినిమాస్ ప‌తాకంపై వెంక‌ట స‌తీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాల‌య్య గ్యాంగ్ స్ట‌ర్ త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం.

స్పందించిన మూవీ యూనిట్‌..

‘#NBK111 షూటింగ్ కాకినాడలో జ‌రుగుతోంది. ఓ యాక్ష‌న్ స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తుండ‌గా నందమూరి బాలకృష్ణగారికి చిన్న మసిల్ టియర్ (కండ‌రాల గాయం)అయింది. వైద్యులు ఓ చిన్న స‌ర్జ‌రీ చేయాల‌ని సూచించారు. సినిమాపై ఆయనకున్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం #NBK111 చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.’ అని చిత్ర బృందం సోష‌ల్ మీడియాలో తెలిపింది.

Rashi Singh : పూల అందంతో పరిమళిస్తున్న రాశి సింగ్.. ఫోటోలు..