Balakrishna
Balayya: నటసింహ నందమూరి బాలకృష్ణ ‘లైగర్’ మూవీ షూటింగ్ స్పాట్‌లో సందడి చేశారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం.. ‘లైగర్’ (సాలా క్రాస్ బ్రీడ్)..
Republic Trailer : ‘అజ్ఞానం గూడు కట్టినచోటే.. మోసం గుడ్లు పెడుతుంది’..
పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద ఛార్మీ, పూరి కలిసి నిర్మిస్తుండగా.. బాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ కూడా నిర్మాణంలో భాగస్వాములయ్యారు. పాండమిక్ తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పున:ప్రారంభమైంది. ప్రస్తుతం గోవాలో నెల రోజుల పాటు షెడ్యూల్ ప్లాన్ చేశారు.
Pelli SandaD Trailer : మహేష్ బాబు రిలీజ్ చేసిన ‘పెళ్లిసందD’ ట్రైలర్..
గోవాకు దగ్గర్లో అఖండ సినిమా షూటింగ్ జరుగుతుండటంతో లైగర్ సెట్‌లోకి వచ్చారు నందమూరి బాలకృష్ణ. లైగర్ సెట్‌ను చూసి చిత్రయూనిట్‌ను అభినందించారు. సెట్ గ్రాండ్ నెస్‌ను చూసి, సినిమాను ఇంత భారీ ఎత్తున నిర్మిస్తుండటంతో మేకర్స్ మీద బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. ఇక లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ లుక్‌ను చూసి బాలకృష్ణ ఆశ్చర్యపోయారు. లైగర్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటూ టీంకు కంగ్రాట్స్ తెలిపారు బాలకృష్ణ. విజయ్ దేవరకొండ, ఛార్మీ, పూరితో బాలయ్య కలిసి ఉన్న పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘పైసా వసూల్’ తర్వాత పూరి – బాలయ్యల క్రేజీ కాంబోలో త్వరలో ఓ సినిమా తెరకెక్కనుంది.
Jai Balayya! pic.twitter.com/tXJskFV5f2
— Vijay Deverakonda (@TheDeverakonda) September 22, 2021