Republic Trailer : ‘అజ్ఞానం గూడు కట్టినచోటే.. మోసం గుడ్లు పెడుతుంది’..
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, డిఫరెంట్ కథా చిత్రాల డైరెక్టర్ దేవ కట్టా కాంబినేషన్లో వస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’ ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు..

Republic Trailer
Republic Trailer : సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా.. విభిన్న కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దేవ కట్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్.. రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బుధవారం ‘రిపబ్లిక్’ థియేట్రికల్ ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు.
Bigg Boss 5 Telugu : ప్రియ కామెంట్స్‌పై రవి భార్య రియాక్షన్.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..
‘‘సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదలవుతోంది.
మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్‌కి శ్రీరామ రక్ష’’.. అంటూ చిరంజీవి ట్విట్టర్లో పేర్కొన్నారు.
సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష.
Launching the trailer :https://t.co/mdA3ILcZld@IamSaiDharamTej
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2021
ట్రైలర్ విషయానికొస్తే.. ‘ప్రస్థానం’ సినిమాతో రాజకీయాలను సరికొత్త కోణంలో ప్రస్తావించిన దేవ కట్టా మరోసారి పాలిటిక్స్‌ని బేస్ చేసుకుని.. సొసైటీకి అవగాహన కల్పించేలా మంచి కథ రాసుకున్నారని అర్థమవుతుంది. సాయి తేజ్ మేకోవర్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. నటనకు ఆస్కారమున్న పాత్రే ఇశ్వర్యకి దక్కిందనిపిస్తుంది. ఇక రమ్యకృష్ణ నెగెటివ్ టచ్ ఉన్న పొలిటిషియన్‌గా ఆకట్టుకున్నారు.
Tamannaah : తన సమస్యను బయటకు చెప్పలేనంటున్న తమన్నా
‘సమాజంలో తిరిగే అర్హతేలేని గూండాలు.. పట్టపగలే బాహాటంగా అమాయకుల ప్రాణాలు తీస్తేంటే.. కంట్రోల్ చెయ్యాల్సిన వ్యవస్థలే వాళ్లకి కొమ్ముకాస్తున్నాయ్’.. ‘ఆ రాక్షసులు ప్రపంచమంతటా ఉన్నార్రా.. కానీ వ్యవస్థ వాళ్లని పోషిస్తుందా.. శిక్షిస్తుందా? అనేదే తేడా’.. ‘మీ భయం.. అజ్ఞానం.. అమాయకత్వం.. విశ్వాసమే.. ఆ సింహాసనానికి నాలుగు కాళ్లు’.. ‘అజ్ఞానం గూడు కట్టినచోటే.. మోసం గుడ్లు పెడుతుంది’.. వంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.. మణిశర్మ కంపోజ్ చేసిన ఆర్ఆర్ చాలా బాగుంది. సినిమాటోగ్రాఫర్ ఎమ్.సుకుమార్ విజువల్స్ చక్కగా కుదిరాయి.. అక్టోబర్ 1న ‘రిపబ్లిక్’ మూవీ థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.