NBK 109 Glimpse : NBk 109 గ్లింప్స్ రిలీజ్.. బాలయ్యబాబు హంటింగ్ చూశారా?
తాజాగా నేడు మహా శివరాత్రి సందర్భంగా NBk 109 సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు.
- Saketh U
- Updated on- March 8, 2024 / 05:42 PM IST
Nandamuri Balakrishna NBK 109 First Glimpse Released
NBK 109 Glimpse : అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల హిట్స్ కొట్టి బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ 109వ సినిమా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
తాజాగా నేడు మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో అగ్నిలావాలా పొంగుతున్నట్టు చూపించి బాలయ్యబాబు ఎంట్రీ ఇచ్చాడు. విలన్ – ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా అంటే బాలయ్య – సింహం నక్కలా మీదకు వస్తే వార్ అవ్వదురా లఫుట్.. హంటింగ్ అంటారు అని పవర్ ఫుల్ గా చెప్పి యాక్షన్ సీన్ తో అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ వైరల్ గా మారింది. ఇక ఇందులో బాలయ్య బాబు సరికొత్త లుక్ లో మరింత యంగ్ గా కనపడ్డారు.
https://www.youtube.com/watch?v=HYu23wXZDbQ
Also Read : Kalki 2898 AD : కల్కిలో ప్రభాస్ క్యారెక్టర్ పేరేంటో తెలుసా? ప్రభాస్ కొత్త పోస్టర్ రిలీజ్..
ఇటీవల శరవేగంగా షూటింగ్ జరిగిన ఈ సినిమా ప్రస్తుతం బ్రేక్ తీసుకుంది. ఎలక్షన్స్ దగ్గరికి వస్తుండటంతో బాలయ్య బాబు ఆ బిజీలో ఉండి షూట్ కి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమా 1980లో స్టోరీతో, ఫుల్ యాక్షన్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. వయోలెన్స్ కి విజిటింగ్ కార్డు, ప్రపంచానికి ఇతను తెలుసు, కానీ ఇతని ప్రపంచం ఎవ్వరికి తెలీదు అనే కొటేషన్ తో సినిమా ఓపెనింగ్ సమయంలో ఓ పోస్టర్ ని రిలీజ్ చేసి అంచనాలు పెంచారు.
