Kalki 2898 AD : కల్కిలో ప్రభాస్ క్యారెక్టర్ పేరేంటో తెలుసా? ప్రభాస్ కొత్త పోస్టర్ రిలీజ్..
కల్కిలో ప్రభాస్ క్యారెక్టర్ పేరేంటో తెలుసా? ప్రభాస్ కొత్త పోస్టర్ రిలీజ్..

Prabhas Character Name Revelead from Kalki 2898 AD Movie on Maha Shivaratri
Kalki 2898 AD : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా ఆతెరకెక్కుతున్న ‘కల్కి 2898AD'(Kalki) సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో హాలీవుడ్ సినిమాలకు ధీటుగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ సాంగ్ ని ప్రభాస్ – దిశా పటాని మధ్య ఇటలీ బీచ్ లో షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహాభారతం నుంచి భవిష్యత్తు వరకు చుపిస్తున్నామని డైరెక్టర్ చెప్పారు. కల్కి 2898AD సినిమా మే 9న రిలీజ్ కాబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. ప్రభాస్ అభిమానులే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read : Bhimaa Review : ‘భీమా’ మూవీ రివ్యూ.. గోపీచంద్ డ్యూయల్ రోల్‌లో మెప్పించాడా?
తాజాగా నేడు మహాశవరాత్రి సందర్భంగా ప్రభాస్ లుక్ ఒకటి రిలీజ్ చేస్తూ ఆ క్యారెక్టర్ పేరుని రివీల్ చేశారు. కల్కి సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు భైరవ అని రివీల్ చేశారు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో ప్రభాస్ పేరు కల్కి ఉండొచ్చు అని కొంతమంది భావించారు. విష్ణువు అవతారం అని, కల్కిలా ప్రపంచం అంతమయ్యేటప్పుడు వస్తాడని ఈ సినిమా గురించి పలు వార్తలు రాగా ఇప్పుడు శివరాత్రి రోజు శివుడి అర్ధం వచ్చేలా భైరవ అనే పేరు ప్రకటించడంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.
From the future streets of Kasi, Introducing 'BHAIRAVA' from #Kalki2898AD.#Prabhas #Kalki2898ADonMay9 @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/GzJyO3V5iQ
— Kalki 2898 AD (@Kalki2898AD) March 8, 2024