22 ఏళ్ళ పెద్దన్నయ్య
సంక్రాంతి కానుకగా, 1997 జనవరి 10న రిలీజ్ అయిన పెద్దన్నయ్య సినిమా, 2019 జనవరి 10 నాటికి 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

సంక్రాంతి కానుకగా, 1997 జనవరి 10న రిలీజ్ అయిన పెద్దన్నయ్య సినిమా, 2019 జనవరి 10 నాటికి 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
యువరత్న నందమూరి బాలకృష్ణ, రోజా, ఇంద్రజ, హీరో, హీరోయిన్లుగా, శరత్ దర్శకత్వంలో, రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌పై, నందమూరి రామకృష్ణ నిర్మించిన సినిమా, పెద్దన్నయ్య.. బాలకృష్ణ, ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చెయ్యగా, అచ్యుత్, రాజ్ కుమార్ ఆయన తమ్ముళ్ళుగా నటించారు. ఫ్యామిలీ, సెంటిమెంట్, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన పెద్దన్నయ్య, సంక్రాంతి కానుకగా, 1997 జనవరి 10న రిలీజ్ అయ్యింది. 2019 జనవరి 10 నాటికి ఈ సినిమా విడుదలై 22 సంవత్సరాలు పూర్తవుతుంది. వయసుపైబడ్డ గెటప్‌లోనూ, యంగ్‌లుక్‌లోనూ బాలయ్య ఆకట్టుకుంటాడు పెద్దన్నయ్యలో. రామకృష్ణ ప్రసాద్ క్యారెక్టర్ సినిమాకే హైలెట్ అయ్యింది.
ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చే ఎమోషనల్ సీన్స్, బాలయ్య, రోజాల మధ్య సీన్స్, కాలేజీ సీన్స్ అన్నీ కూడా బాగుంటాయి. ఈ సినిమాలో బాలయ్య చెప్పిన.. పదవికి నేను అలంకారమేమో కానీ, నాకు పదవి అలంకారం కాదు అనే డైలాగ్, ఆయన అభిమానుల్లో ఇప్పటికీ వినబడుతూనే ఉంటుంది. స్టార్ హీరో అయ్యిండి, క్లైమాక్స్‌లో క్యారెక్టర్ చనిపోతుందని తెలిసి కూడా, ఒప్పుకుని చెయ్యడం అనేది పెద్ద సాహసం, అది బాలయ్యకే చెల్లింది. పెద్దన్నయ్యకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్టయ్యారు. ఈ సినిమాకి మరో హైలెట్ కోటి సంగీతం.
కుటుంబం, అన్నగారి కుటుంబం, కల్లో కళ్యాణమాల, నీ అందమంత చిందగొట్టి, ఓ ముస్తఫ్ఫా, చక్కిలాల చుక్కా చక్కగుందిరోయ్, చిక్కింది చేమంతి పువ్వు వంటి పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాకి బాలయ్య అన్నయ్య, నందమూరి మోహన కృష్ణ కెమెరామెన్‌గా పని చెయ్యగా, బాలయ్య తమ్ముడు రామకృష్ణ నిర్మించాడు. బ్రహ్మానందం, శ్రీహరి, కోట, అన్నపూర్ణ తదితరులు నటించిన పెద్దన్నయ్య,1997 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.
వాచ్ చిక్కింది చేమంతి పువ్వు సాంగ్…