Somu Veerraju: చంద్రబాబుతో సోమువీర్రాజు భేటీ.. టీడీపీ, బాబు పేరు ఎత్తితే ఫైరయ్యే లీడర్‌లో ఎందుకింత మార్పు?
బీజేపీ సీనియర్ లీడర్‌గా టీడీపీపై బాణాలు ఎక్కుపెట్టే వారు. ఆయన వైసీపీకి కొంత అనుకూలుడన్న చర్చ అప్పట్లో బాగా వినిపించింది. (Somu Veerraju)

Somu Veerraju: ఏపీలో ఆ బీజేపీ లీడర్ రూటే సెపరేటు. గతంలో కూటమిగా ఉన్నా టీడీపీని టార్గెట్ చేసేవారు. ఆ మాటకొస్తే అప్పుడు బీజేపీ పెద్దలతో టీడీపీకి గ్యాప్ పెరగడానికి ఆయనా ఓ కారణమన్న టాక్ ఉంది. కానీ ఈసారి కూటమిగా పవర్‌లోకి వచ్చినప్పటి నుంచి ఆయన రూటు మార్చినట్లు కనిపిస్తోంది. ఈ మధ్యే ఎమ్మెల్సీ అయిన ఆయన ఏకంగా సీఎం చంద్రబాబుతోనే టచ్‌లోకి వెళ్తున్నారు. బాబుతో సోము భేటీ వెనుక మర్మమేంటి? బీజేపీ కోటాలో మంత్రి పదవి రేసులో ఉన్నారా?
5 నెలల తర్వాత తొలిసారి ముఖ్యమంత్రితో భేటీ..
ఏపీ సీఎం చంద్రబాబుతో..బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు భేటీ ఇంట్రెస్టింగ్‌గా మారింది. మామూలుగా అయితే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చంద్రబాబును వన్ టు వన్ కలవడం కాస్త స్పెషల్. ఇక సోమువీర్రాజు వంటి బీజేపీ నేత బాబుతో భేటీ అంటే సమ్‌థింగ్ ఈజ్ దేర్ అన్న టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజు దాదాపు 5 నెలల తర్వాత తొలిసారి ఆ హోదాలో ముఖ్యమంత్రితో భేటీ కావడం చర్చకు దారితీస్తోంది. బీజేపీలో సీనియర్ నాయకుడు సోము వీర్రాజు. ఈ మధ్యనే మరోసారి ఎమ్మెల్సీ అయ్యారు. పురంధేశ్వరికి ముందు ఏపీ బీజేపీకి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అయితే ఆయన సీఎం చంద్రబాబుతో భేటీ అవడం అయితే ఆసక్తికరంగా ఉందనే అంటున్నారు.
వైసీపీకి అనుకూలుడన్న చర్చ:
2024 ఎన్నికలకు ముందు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు టీడీపీని, చంద్రబాబును ఘాటుగా విమర్శించే వారు సోమువీర్రాజు. అంతకముందు కూడా బీజేపీ సీనియర్ లీడర్‌గా టీడీపీపై బాణాలు ఎక్కుపెట్టే వారు. ఆయన వైసీపీకి కొంత అనుకూలుడన్న చర్చ అప్పట్లో బాగా వినిపించింది. కొందరు టీడీపీ నేతలు డైరెక్ట్‌గానే సోము తీరును తప్పుబట్టేవారు. అయితే ఏపీలో బీజేపీ సొంతంగా ఎదగాలన్న ప్రయత్నంతోనే వైసీపీతో పాటు బాబు, టీడీపీని టార్గెట్‌గా విమర్శలు చేయాల్సి వచ్చిందని తర్వాత చెప్పుకున్నారు. (Somu Veerraju)
అనూహ్యంగా దక్కిన ఎమ్మెల్సీ సీటు..
అదంతా అయిపోయిన గతం. ఇక మొన్నటి ఎన్నికల తర్వాత కేంద్రంలో టీడీపీ సపోర్ట్ బీజేపీకి చాలా అవసరమైంది. దాంతో ఏపీ బీజేపీ నేతలు టీడీపీ పట్ల మరింత సాఫ్ట్‌గా వైఖరితో ముందుకెళ్తున్నారు. బాబు మీద ఘాటైన విమర్శలు చేసిన సోము వీర్రాజు కూడా అదే లైన్‌లో నడుస్తున్నారట. అయితే టీడీపీపై అప్పట్లో ఆ స్థాయి అటాక్ చేసినా చిత్రంగా సోముకు ఎమ్మెల్సీ సీటు దక్కింది. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి నుంచి సోము వీర్రాజు టోన్ కూడా మారిందంటున్నారు. ఆయన చంద్రబాబుని పొగుడుతూ జగన్ మీద ఎవరూ చేయనంతగా విమర్శలు చేస్తున్నారు.
Also Read: మరో పదేళ్లు చంద్రబాబే సీఎం, పులివెందుల ప్రజలు పండగ చేసుకున్నారు- మంత్రి పయ్యావుల కేశవ్
తూర్పు గోదావరి జిల్లాలో నీటి పారుదల సదుపాయాల మెరుగుదల, జాతీయ రహదారుల విస్తరణ, పర్యాటక రంగ అభివృద్ధి, పోలవరం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల అభివృద్ధి, అలాగే గండి పోచమ్మ తల్లి ఆలయ అభివృద్ధి వంటి అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సోము వీర్రాజు చెబుతున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు గండి పోచమ్మ తల్లి చిత్ర పటాన్ని అందజేశారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు.
చంద్రబాబుతో సానుకూలత వెనుక ప్లాన్ ఉందా?
ఈ మధ్యకాలంలో సోము వీర్రాజు టీడీపీ అధినేత పట్ల పూర్తి సానుకూలతతో ఉండటం వెనుక ప్లాన్ ఏమైనా ఉందన్నా చర్చ జరుగుతోంది. మిత్రపక్షం కాబట్టి సాఫ్ట్ కార్నర్ ఉండాలని అనుకుంటున్నారా లేక..క్యాబినెట్‌లో చేరాలంటే బాబుతో బాగుండాలని భావిస్తున్నారా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. సోము వీర్రాజుకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని ఆయన సన్నిహితులు ఆశపడుతున్నారు. రెండు సార్లు ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజుకు మంత్రి పదవి దక్కితే గుర్తింపు ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు. (Somu Veerraju)
త్వరలో ఏపీ క్యాబినెట్ షఫ్లింగ్ అంటున్నారు. ఖాళీగా ఉన్న ఒక్క పోస్ట్‌ను బీజేపీకి ఇస్తారని ఎప్పటినుంచో ఊహాగానాలు వినిసిస్తున్నాయి. బీజేపీ కోటాలో రెండో మంత్రి పదవి సోమువీర్రాజు వంటి సీనియర్ లీడర్‌కు ఇస్తారన్న టాక్ అయితే వినిపిస్తోంది. బాబుతో గట్టిగా పెనవేసుకుంటున్న బంధం సోముకు ఉన్నత పదవి దక్కేలా చేస్తుందా లేదా అనేది చూడాలి.