Balakrishna: బాలకృష్ణకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు.. ఢిల్లీ సీఎం చేతుల మీదుగా ప్రదానం

ఢిల్లీ సీఎం చేతుల 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ పురస్కారాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ(Balakrishna).

Nandamuri Balakrishna Receives Lifetime Achievement Award at Delhi Film Festival

  • ఢిల్లీలో ఘనంగా IFFD 2026 ఫిలిం ఫెస్టివల్
  • బాలకృష్ణకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు
  • అవార్డు అందజేసిన ఢిల్లీ సీఎం

Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ కీర్తికిరీటంలో మరో అరుదైన గౌరవం వచ్చి చేరింది. దేశ రాజధానిలో బుధవారం సాయంత్రం అత్యంత వైభవంగా ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ 2026’ వేడుకల్లో ఆయనకు ప్రతిష్టాత్మక ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ పురస్కారాన్ని అందజేశారు. దశాబ్దాలుగా భారతీయ చలనచిత్ర రంగానికి నందమూరి బాలయ్య చేసిన విశేష కృషిని గుర్తిస్తూ జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు.

Kalki 2: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. కల్కి 2లో అసలైన విశ్వరూపం.. 20 నిమిషాల పాటు కురుక్షేత్ర యుద్ధం

ఢిల్లీలోని ప్రఖ్యాత ‘భారత్ మండపం’ వేదికగా ఈవెంట్‌కు ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేశ్‌ సాహిబ్ సింగ్ వర్మ, సినీ దిగ్గజాలు హేమమాలిని, కంగనా రనౌత్, షర్మిలా ఠాగూర్‌లు పాల్గొన్నారు. బాలకృష్ణ(Balakrishna)తో పాటు అలనాటి నటి షర్మిలా ఠాగూర్, దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్ర తరపున వారి కుటుంబ సభ్యులు కూడా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా బాలకృష్ణ ఈ గౌరవాన్ని అందుకోవడంపై నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని జాతీయ వేదికపై చాటిచెప్పిన బాలయ్యకు అభినందనలు తెలియజేస్తున్నారు.