Kalki 2: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. కల్కి 2లో అసలైన విశ్వరూపం.. 20 నిమిషాల పాటు కురుక్షేత్ర యుద్ధం
'కల్కి 2(Kalki 2)'లో కురుక్షేత్ర యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం.
Kurukshetra War scenes in Kalki 2 set to give goosebumps.
- కల్కి 2లో కురుక్షేత్ర యుద్ధం
- 20 నిమిషాల పాటు సాగనున్న కీలక ఘట్టం
- ఆడియన్స్ ను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లనున్న దర్శకుడు
Kalki 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్‌లో ఇచ్చిన లీడ్స్, మహాభారత ఘట్టాలు ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించాయి. అయితే మొదటి భాగంలో కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన ఎపిసోడ్స్ తక్కువగా ఉండటంతో, ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు.
ఇప్పుడు ఆ వెలితిని తీరుస్తూ ‘కల్కి 2’లో ఒక భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడట నాగ్ అశ్విన్. కల్కి(Kalki 2) రెండో భాగంలో మహాభారతానికి సంబంధించిన ఎపిసోడ్ ఏకంగా 20 నిమిషాల పాటు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మొదటి భాగంలో పరిచయమైన అశ్వత్థామ శాపం, కర్ణుడి వీరత్వం, కృష్ణుడి వ్యూహాలను పార్ట్-2లో నాగ్ అశ్విన్ విజువల్ గ్రాండియర్‌తో చూపించబోతున్నారట. పురాణాలను సైన్స్ ఫిక్షన్‌తో జోడించి ఉండే ఈ 20 నిమిషాల సీక్వెన్స్‌ను తీర్చిదిద్దుతున్న తీరు ఇండియన్ సినీ చరిత్రలోనే ఒక సరికొత్త ప్రయోగం కానుందని సమాచారం.
Vishnu Priya: అందంతో పిచ్చెక్కిస్తున్న విష్ణు ప్రియ.. ఆ మత్తు కళ్ళు చూస్తే మైండ్ బ్లాకే.. ఫొటోలు
ఈ ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. పార్ట్-1 కేవలం పాత్రల పరిచయం మాత్రమే అయితే, అసలైన యుద్ధం, భావోద్వేగాలు పార్ట్-2లోనే ఉండబోతున్నాయట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్లపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు.
త్వరలోనే ప్రభాస్ కూడా సెట్స్‌లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ తన విజన్‌తో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, 2026 చివరి నాటికి లేదా 2027 ఆరంభంలో ఈ సినిమా వెండితెరపై సందడి చేసే అవకాశం ఉంది. ఈ భారీ సీక్వెన్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
