×
Ad

Nandamuri Mokshagna : ఏమున్నాడ్రా బాబు.. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కొత్త లుక్స్ అదుర్స్.. హీరో రెడీ..

ఇవాళ ఉదయం మోక్షజ్ఞకి సంబంధించిన ఓ స్టైలిష్ ఫోటో బయటకు రావడంతో..

  • Published On : July 2, 2024 / 02:00 PM IST

Nandamuri Balakrishna Son Mokshagna New Looks Photos goes Viral Ready for entry in Film Industry

Nandamuri Mokshagna : నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తాడని ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలకృష్ణ కూడా అనేకసార్లు తన కొడుకు సినిమాల్లోకి వస్తాడని అన్నారు. అయితే ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఇవాళ ఉదయం మోక్షజ్ఞకి సంబంధించిన ఓ స్టైలిష్ ఫోటో బయటకు రావడంతో అసలు ఇతను మోక్షజ్ఞనేనా అని సందేహం కూడా వ్యక్తం చేసారు.

ఆ ఫోటో సైడ్ వ్యూ ఉండటంతో, ఫ్యాన్ పేజీలో పోస్ట్ చేయడంతో మోక్షజ్ఞ ఇంతలా ఎప్పుడు మారాడు అని ప్రశ్నించారు. అయితే తాజాగా పలువురు సినిమా వ్యక్తులు మోక్షజ్ఞ మరో ఫోటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ ఫోటో చూసి అభిమానులు, నెటిజన్లు అంతా ఆశ్చర్యపోతున్నారు. మొన్నటిదాకా ఒకలా ఉండి ఇవాళ హీరో లెవల్లో అదిరిపోయే లుక్స్ తో మోక్షజ్ఞ కనపడుతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. హీరోకి కావాల్సిన లుక్స్ లో అదరగొడుతున్నాడుగా అని అంటున్నారు.

Also Read : Kalki 2898 AD : ప్ర‌భాస్ ‘క‌ల్కి’ దెబ్బ‌కి బాలీవుడ్ స్టార్ హీరో సినిమా వాయిదా..!

ఇక మోక్షజ్ఞ కొత్త ఫొటోలు చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ రెడీ అయిందని, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతిలో లాంచ్ అవుతాడని, ఇప్పటికే సత్యానంద్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడని సమాచారం. ఇదే నిజమైతే ఇన్నాళ్లు ఎదురుచూసిన నందమూరి అభిమానుల కోరిక త్వరలో తీరబోతుంది. ప్రస్తుతం మోక్షజ్ఞ ఫొటోలు వైరల్ గా మారాయి.