Kalki 2898 AD : ప్ర‌భాస్ ‘క‌ల్కి’ దెబ్బ‌కి బాలీవుడ్ స్టార్ హీరో సినిమా వాయిదా..!

ప్ర‌స్తుతం భార‌త‌దేశం మొత్తం కూడా క‌ల్కి సినిమా హ‌వా న‌డుస్తోంది.

Kalki 2898 AD : ప్ర‌భాస్ ‘క‌ల్కి’ దెబ్బ‌కి బాలీవుడ్ స్టార్ హీరో సినిమా వాయిదా..!

Ajay Devgn Auron Mein Kahan Dum Tha postponed

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా న‌టించిన సినిమా క‌ల్కి 2898 AD. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ 27 జూన్ 2024న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్ప‌టికే 550 కోట్ల‌పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ వారం చివ‌ర‌కు వెయ్యి కోట్ల‌కు చేరుకునే అవ‌కాశం ఉంది.

ప్ర‌స్తుతం భార‌త‌దేశం మొత్తం కూడా క‌ల్కి సినిమా హ‌వా న‌డుస్తోంది. అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్, ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో తెర‌కెక్కిన ఈ మూవీని చూసేందుకు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు క్యూ క‌డుతున్నారు. ఎక్క‌డ చూసినా క‌ల్కి మానియా న‌డుస్తుండ‌డంతో ఇప్ప‌ట్లో కొత్త సినిమాలు విడుద‌ల అయ్యే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు.

Prabhas : ‘కల్కి’ తర్వాత.. ప్రభాస్ చేతిలో ఏకంగా అరడజను భారీ సినిమాలు.. ఏ స్టార్ హీరోకి కూడా ఇన్ని సినిమాలు లేవు..

బాలీవుడ్‌లోనూ క‌ల్కి హ‌వా కొన‌సాగుతోంది. ఎంత‌లా అంటే.. ఓ స్టార్ హీరో త‌న సినిమాను వాయిదా వేసుకుంటున్న‌ట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్‌దేవ‌గ‌న్ న‌టించిన సినిమా “ఔరోన్ మెయిన్ కహాన్ దం తా” . ట‌బు హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ జూలై 5న ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉంది. అయితే.. ప్ర‌స్తుతం క‌ల్కి మానియా న‌డుస్తుండ‌డంతో త‌మ చిత్రాన్ని విడుద‌ల చేస్తే ఖ‌చ్చితంగా అది క‌లెక్ష‌న్ల పై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని చిత్ర బృందం భావిస్తోందట‌.

ఈ క్ర‌మంలో త‌మ సినిమాను వాయిదా వేయాల‌ని చిత్ర బృందం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యాన్ని త్వ‌ర‌లోనే చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంద‌ని స‌మాచారం. ఫ్రైడే ఫిలిం వర్క్స్, ఎన్ హెచ్ స్టూడియోజ్ నిర్మించిన ఈ సినిమాకు నీర‌జ్ పాండే ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Maharaja – Kalki : వంద కోట్ల ‘మహారాజ’.. తమిళ్‌లో ప్రభాస్ ‘కల్కి’కి పోటీ ఇస్తున్న విజయ్ సేతుపతి..?