ముచ్చటగా మూడు సినిమాలు లైన్‌లో పెట్టాడుగా!

నటసింహ నందమూరి బాలకృష్ణ బోయపాటి, పూరీ జగన్నాధ్, క్రిష్‌లతో ముచ్చటగా మూడు సినిమాలను ఫిక్స్ చేసి, ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశాడు..

  • Publish Date - September 30, 2019 / 08:07 AM IST

నటసింహ నందమూరి బాలకృష్ణ బోయపాటి, పూరీ జగన్నాధ్, క్రిష్‌లతో ముచ్చటగా మూడు సినిమాలను ఫిక్స్ చేసి, ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశాడు..

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌తో జరుగుతుంది. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ మూవీలో బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే బాలయ్య ఏకంగా మూడు సినిమాలను లైన్‌లో పెట్టి, ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశాడు.  

‘NBK 106’ బాలయ్య, బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా రూపొందనుంది. తర్వాత ‘పైసా వసూల్‌’తో బాలయ్యని తన మార్క్ యాటిట్యూడ్‌తో చూపించి ఆకట్టుకున్న డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌తో చెయ్యనున్నాడు. పైసా వసూల్ టైమ్‌లో బాలయ్యతో లవ్‌లో పడిపోయానని, ఆయన ఎప్పుడంటే అప్పుడు సినిమా చెయ్యడానికి రెడీ అని బాలయ్యపై తన అభిమానాన్ని చాటుకున్న పూరీకి మరో అవకాశం ఇచ్చాడు బాలయ్య.

Read Also : హౌస్ ఫుల్ 4 – ‘ఏక్ చుమ్మా’ వీడియో సాంగ్..

ఇక ‘NBK 108’ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చెయ్యబోతున్నాడు. బాలయ్యతో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాల తర్వాత క్రిష్ చెయ్యబోయే సినిమా ఇది. ఈ ముగ్గురు డైరెక్టర్స్ ఇంతకుముందు బాలయ్యతో సినిమాలు చేసినవాళ్లే కావడం, వరసగా సినిమాలను ఓకే చేసి, తను దర్శకుల హీరో అనే మాటను మరోమారు నిజం చెయ్యడంతో బాలయ్య అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. NBK 105 డిసెంబర్‌లో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. బోయపాటి సినిమా త్వరలో ప్రారంభం కానుంది.