Nandamuri Deepika : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వదినమ్మ..? టీడీపీ పోస్టర్స్‌తో వైరల్.. బయటకొచ్చిన నందమూరి దీపిక..
నందమూరి దీపిక ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. (Nandamuri Deepika)
- Saketh U
- Updated on- July 22, 2026 / 04:51 PM IST
Nandamuri Deepika Janaki Ram Wife NTR Cousin Political Entry
Nandamuri Deepika : నందమూరి కుటుంబం నుంచి మరొకరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. దివంగత రాజకీయ నేత, నటుడు నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ కొన్నేళ్ల క్రితం ఓ యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన భార్య నందమూరి దీపిక ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి.
గతంలో జానకిరామ్ జీవించి ఉన్నప్పుడు కానీ, ఆయన మరణం తర్వాత కానీ దీపిక రాజకీయాల్లో, సినిమా కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పోటీ చేసినప్పుడు ఆమె తరఫున ప్రచారం చేసారు. ఇటీవల వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తన కొడుకు ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా సినిమా ఓపెనింగ్ అయినప్పుడు కనిపించారు. అయితే గత రెండు వారాలుగా ఆమె అధికారికంగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి వరుస పోస్టులు చేస్తూ, మరో పక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
Also Read : Jana Nayagan First Review : ‘జన నాయగాన్’ ఫస్ట్ రివ్యూ.. ‘భగవంత్ కేసరి’ రీమేక్ వర్కౌట్ అవుతుందా?
నందమూరి దీపిక ఎన్టీఆర్, చంద్రబాబు, హరికృష్ణ, జానకిరామ్ ఫోటోలు పెట్టుకొని టీడీపీ పోస్టర్స్ తో పలు పోస్టులు చేస్తున్నారు తన సోషల్ మీడియాలో అంతే కాక ఇటీవల కొండకల్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో చిన్నారుల కోసం నందమూరి జానకిరామ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడ చిన్నారులకు కుర్చీలు, డ్రై ఫ్రూట్స్ అందించారు. అనంతరం మీడియాతో కూడా మాట్లాడారు.
ఇలా ఇప్పుడిపుడే బయటకు వస్తూ, జనాల్లోకి వెళ్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు నందమూరి దీపిక. దీంతో ఈమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? టీడీపీ తరపున ప్రచారం చేస్తారా? ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా అని చర్చగా మారింది.
