Jana Nayagan First Review : ‘జన నాయగాన్’ ఫస్ట్ రివ్యూ.. ‘భగవంత్ కేసరి’ రీమేక్ వర్కౌట్ అవుతుందా?
థ పరంగా బాలకృష్ణ భగవంత్ కేసరిలో కొన్ని పాయింట్స్ మాత్రమే తీసుకున్నట్టు తెలుస్తుంది. (Jana Nayagan)
jana nayagan
Jana Nayagan : తమిళ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ హీరోగా చేసిన చివరి సినిమా జన నాయగాన్. మన బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా గత సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా సెన్సార్ ఇబ్బందులు, పొలిటికల్ ఇబ్బందులతో ఈ సినిమా రిలీజ్ ఆగింది. ఎట్టకేలకు రేపు జులై 23న జన నాయగాన్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించగా మమిత బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ పలువురు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు, హిందీలో కూడా రిలీజ్ కానుంది. ఇప్పటికే తమిళ్, తెలుగులో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్స్, పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు చూసారు. ఇక సెన్సార్ వాళ్ళు కూడా ఈ సినిమాని చూసి A రేటింగ్ ఇవ్వడం గమనార్హం. కథ పరంగా బాలకృష్ణ భగవంత్ కేసరిలో కొన్ని పాయింట్స్ మాత్రమే తీసుకున్నట్టు తెలుస్తుంది.
Also Read : Meher Raamesh : టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం..
విజయ్ జైలులో ఖైదీలా ఉండటం, అక్కడ జైలర్ పరిచయం, అతని సాయంతో బయటకు రావడం, ఆ జైలర్ చనిపోవడంతో అతని కోరిక మేరకు అతని కూతురు(మమిత బైజు)ని పెంచడం, ఆమెని ఆర్మీ ఆఫీసర్ చేయాలి అనుకోవడంతో ఫస్ట్ హాఫ్ అంతా ఇదే సాగనుందట. భగవంత్ కేసరి కథ కూడా ఇంతే. అయితే ఫ్లాష్ బ్యాక్ మార్చుకున్నారట. భగవంత్ కేసరిలో ఓ వ్యక్తితో హీరో పోలీస్ గా ఓ వ్యక్తితో వివాదం పెట్టుకొని జైలుకు వెళ్తే ఇక్కడ విజయ్ పోలీసాఫీసర్ గా ఓ పొలిటికల్ లీడర్ తో వివాదం పెట్టుకున్నట్టు, అనుకోకుండా జైలుకు వెళ్లినట్టు చూపించారట. ఆ తర్వాత పొలిటికల్ లీడర్ చాలా పెద్ద పొజిషన్ కి వెళ్లడం, ఒక సమస్యలో మమిత బైజు ఇరుక్కోవడంతో ఆ పొలిటికల్ లీడర్ మనుషులు, అతనికి సంబంధించిన ఓ మాఫియా వ్యక్తి ఆమె వెంట పడటం, ఆమెని విజయ్ ఎలా కాపాడాడు అనే కథాంశంతో సాగనుందట జన నాయగాన్.
పాప స్టోరీ మొత్తం భగవంత్ కేసరి కథ తీసుకొని హీరో ఫ్లాష్ బ్యాక్ మాత్రం తమిళ్ నాడు నేటివిటికి తగ్గట్టు, అక్కడ రాజకీయాలకు తగ్గట్టు రాసుకున్నారట. విజయ్ ఎన్నికల ముందు ఈ సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. తనకు పొలిటికల్ గా కూడా పనిచేస్తుంది అనుకున్నారు. అలా ప్లాన్ చేసుకొని సినిమాలో ప్రభుత్వం మీద, సీఎం మీద పలు పంచ్ డైలాగ్స్ రాసుకున్నారట. కానీ ఆ పంచ్ డైలాగ్స్ ఇప్పుడు కూడా బాగానే పేలుతాయని తెలుస్తుంది. ఇక విజయ్ కూడా బాలయ్య తరహాలో ఈ సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లు చేశారట. శ్రీలీల పాత్రలో మమిత బైజు బాగానే చేసింది. ఇక భగవంత్ కేసరిలో కాజల్ డాక్టర్ గా కనిపిస్తే ఇందులో పూజ హెగ్డే విజయ్ కి సపోర్ట్ చేసే ఓ జర్నలిస్ట్ గా చూపించారట. అలా చిన్న చిన్న మార్పులు అయితే చేసుకున్నారు.
Also Read : Chiranjeevi : సంక్రాంతి రేసు నుంచి మెగాస్టార్ అవుట్..!
యాక్షన్ సీక్వెన్స్ జైలు ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ బాగున్నా అవి భగవంత్ కేసరి నుంచే అలాగే తీసుకున్నారు. ఈ సినిమా మొత్తం నిడివి 3 గంటల 3 నిమిషాల 52 సెకన్లు. విజయ్ జన నాయగాన్ సినిమాలో తమిళ లెజెండరీ హీరో, రాజకీయ నాయకుడు MGR రిఫరెన్స్ లు చూపించారట. విజయ్ ఫ్యాన్స్ కి అయితే పండగే అని చెప్తున్నారు తమిళనాట. ఇన్నాళ్లు క్యూట్ గా మెప్పించిన మమిత బైజు మాత్రం ఇందులో ఎమోషనల్ గా, యాక్షన్ సీక్వెన్స్ లతో మెప్పిస్తుంది. పూజ హెగ్డే మాత్రం అక్కడక్కడా అలా వచ్చి వెళ్ళిపోతుంది. బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ విలన్స్ గా అదరగొట్టారని తెలుస్తుంది.
అనిరుధ్ మాత్రం విజయ్ కి అదిరిపోయే ఎలివేషన్స్ ఇచ్చాడట తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో. పాటలు మాత్రం యావరేజ్ అని సమాచారం. విజయ్ తమిళ్ స్టార్ హీరో అవడం, అయన చివరి సినిమా అవడం, విజయ్ సీఎం అయ్యాక ఫస్ట్ సినిమా కావడంతో రేపు రిలీజ్ అయినా తమిళనాట ఇవాళ్టి నుంచే సందడి నెలకొంది థియేటర్స్ దగ్గర. రేపు తమిళనాడు థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం నెలకొంది. తెలుగులో కూడా రేపు భారీగా అన్ని థియేటర్స్ లో ఇదే సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మరి ఆడియన్స్ కి ఈ సినిమా ఎంత వరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. తమిళ్ లో అయితే భారీ ఓపెనింగ్స్ వస్తాయని సమాచారం.
