Chiranjeevi : సంక్రాంతి రేసు నుంచి మెగాస్టార్ అవుట్..!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దర్శకుడు బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్టింగ్ గాసిప్ చక్కర్లు కొడుతోంది.
IS Megastar out of the Sankranti race
Chiranjeevi :ఒకప్పుడు సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కచ్చితంగా కాసుల పంటే అనే ఫీలింగ్ ఉండేది. కొన్నేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. పెద్ద హీరోల సినిమాలు, మిడిల్ రేంజ్ సినిమాలు అన్నీ ఒకేసారి రిలీజ్ అవడంతో థియేటర్ల కోసం కాంపిటీషన్ ఎక్కువైపోయిందట.
ఒక్కో సినిమాకు సరిపడే స్క్రీన్స్ దొరకకపోవడం, కలెక్షన్స్ స్ప్లిట్ అవ్వడంతో రావాల్సిన రెవెన్యూ తగ్గిపోతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. పోయిన సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలకు ఓపెనింగ్స్ బాగానే ఉన్నా, నిర్మాతలకు పెద్దగా లాభాలు ఇవ్వలేదంటున్నారు. దీంతో సంక్రాంతి రేసు అంటే హిట్ ఫార్ములా అన్న అభిప్రాయం కాస్త మారిపోతోందట.
Vijay Deverakonda : ఈ సినిమా ఆగిపోయిందని తెలుసా? విజయ్ ప్రభాస్ కంటే ముందే ఆ హీరోయిన్ ని..
ఇలాంటి పరిస్థితుల్లోనే మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్టింగ్ గాసిప్ చక్కర్లు కొడుతోంది. మొదట ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దింపాలనే ప్లాన్ చేసినప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర కాంపిటీషన్ హెవీగా ఉండటంతో మేకర్స్ ప్లాన్ మార్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను..ఏ కాంపిటీషన్ లేనప్పుడు సోలోగా రిలీజ్ చేయడమే బెటర్ అని ఆలోచిస్తున్నారట. అప్పుడే ఎక్స్పెక్ట్ చేసినంత కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారట. సంక్రాంతికి కనీసం రెండు, మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండటంతో, క్లాష్, రిస్క్ ఎక్కువైపోతుందని లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే సంక్రాంతి రేస్ నుంచి తప్పుకొని సమ్మర్ లేదా ఇతర ఫెస్టివల్ సీజన్‌ను టార్గెట్ చేసే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ సినిమా సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంటుందో లేదో క్లారిటీ లేదు కానీ..ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం కొత్త ట్రెండ్‌ను సెట్ చేసేనట్లేనని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
