Meher Raamesh : టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం..
టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ (Meher Raamesh ) ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
Tollywood director Meher Raamesh sister passed away
Meher Raamesh : టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి మెహర్ జ్యోతి సుంకర కన్నుమూశారు. గత 14 రోజులుగా ఆమె వైరల్ న్యూమోనియోతో బాధపడుతున్నారు. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వేదికగా మెహర్ రమేష్ తెలియజేశారు.
ఈ పోస్ట్‌లో మెహర్ రమేష్ తన అక్కతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురి అయ్యారు. చిన్నప్పటి నుంచి ఆమె తనకు అండగా నిలిచిందని, ప్రేమగా చూసుకునేదని వెల్లడించారు. తన కుమార్తె వివాహాన్ని దగ్గరుండి జరిపించిందని, తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఎంతో ఆనందించామని గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి అయిన ఆమె.. ఇంత త్వరగా అందరిని విడిచిపెట్టి వెళ్లిపోవడం తమ కుటుంబానికి తీరని లోట అని చెప్పారు. ఆ దేవుడి సన్నిధికి ఆమె వెళ్లిపోయిందనే విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ మెహర్ రమేష్ రాసుకొచ్చారు.
Chiranjeevi : సంక్రాంతి రేసు నుంచి మెగాస్టార్ అవుట్..!
View this post on Instagram
ఈ విషాద వార్త తెలిసిన వెంటనే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా మెహర్ రమేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
