Nandini Reddy: జాక్ పాట్ కొట్టిన నందిని రెడ్డి.. సమంత భర్త రాజ్ సాయంతో ఏకంగా…

నందిని రెడ్డి ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్లాలని ప్రయత్నిస్తుంది. (Nandini Reddy)

  • Updated on- July 9, 2026 / 11:33 AM IST

Nandini Reddy Wants To Do Movie In Bollywood

Nandini Reddy : చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది నందిని రెడ్డి. తాను చేసిన సినిమాల్లో మూడు సమంతతోనే చేసింది. సమంత – నందిని మంచి స్నేహితులు. ఇటీవలే వీళ్లిద్దరి కాంబోలో మా ఇంటి బంగారం అనే సినిమా వచ్చి భారీ హిట్ కొట్టింది. ఈ సినిమా హిట్ తో నందిని రెడ్డికి మరింత క్రేజ్ వచ్చింది.

దీంతో నందిని రెడ్డి ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్లాలని ప్రయత్నిస్తుంది. మా ఇంటి బంగారం సక్సెస్ తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నందిని రెడ్డి మాట్లాడుతూ..నేను రెండేళ్లు ఢిల్లీలో చదువుకున్నాను. అప్పుడు హిందీ సినిమాలు రెగ్యులర్ గా చూసేదాన్ని. మంచి కథ ఉంటే కచ్చితంగా హిందీలో సినిమా చేస్తాను. త్వరలో ఒక డార్క్ సూపర్ నేచురల్ వెబ్ సిరీస్ చేయబోతున్నాను. అది అక్టోబర్ లో మొదలవుతుంది. ఇన్నాళ్లు లైట్ హార్టెడ్ సినిమాలు చేశాను. ఇప్పుడు డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాను. ఆ సిరీస్ అయ్యాక సినిమా గురించి ఆలోచిస్తాను అని తెలిపింది.

Also See – Vimala Raman : చాన్నాళ్ల గ్యాప్ తర్వాత అందాలు ఆరబోస్తున్న విమలా రామన్..

దీంతో నందిని రెడ్డి కచ్చితంగా బాలీవుడ్ లో సినిమా చేయబోతోందని తెలుస్తుంది. సమంత భర్త రాజ్ నిడిమోరు ఇప్పటికే బాలీవుడ్ లో సినిమాలు, సిరీస్ లు చేసి దర్శక నిర్మాతగా అక్కడ మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. సమంత బెస్ట్ ఫ్రెండ్ కావడంతో రాజ్ కి కూడా నందినితో మంచి స్నేహం ఏరపడింది. మా ఇంటి బంగారం సినిమాకు వీళ్ళిద్దరూ కలిసి పనిచేసారు. దీంతో నందిని మంచి కథ రెడీ చేస్తే రాజ్ నిడిమోరు సాయంతో బాలీవుడ్ లోకి ఈజీగా ఎంటర్ అవుతుంది నందిని. ఇక తాను తీయబోయే వెబ్ సిరీస్ కూడా అన్ని భాషల్లో రిలీజ్ ఉండే అవకాశం ఉంది.