Nani : న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా సినిమాతో రాబోతున్నాడు. మార్చ్ 30న దసరా సినిమా రిలీజ్ కాబోతుంది. మొదటి సారి నాని పూర్తి మాస్ లుక్ లో కనపడుతుండటం, ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్స్ అదరగొట్టేయడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నాని. దసరా సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాబోతుండటంతో ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు నాని.
దసరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం సాయంత్రం నాని ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించాడు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు నాని సమాధానం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్.. నీ సినిమాలు బాగుంటాయి కానీ నీ సినిమాలకు కలెక్షన్స్ రావు అని అడిగాడు. దీనికి నాని సమాధానమిస్తూ.. నా నిర్మాతలు సినిమా లాభాల గురించి మరోలా చెబుతూ ఉంటారు. కొన్ని సార్లు సినిమా కలెక్షన్లని నాకు చెప్తూ ఉంటారు కూడా అని అన్నాడు. దీంతో కలెక్షన్స్ వచ్చినా ప్రొడ్యూసర్లు బయటకి చెప్పట్లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Pathaan : థియేటర్స్ లో 50 రోజులు అదరగొట్టిన పఠాన్.. ఇప్పుడు ఓటీటీ వంతు..
ఆ అభిమాని అడిగిన ప్రశ్న కూడా సరైందే. నాని గత సినిమాలు జెర్సీ, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి.. లాంటి సినిమాలు చాలా మంచి క్లాసిక్ హిట్స్ లా నిలిచాయి కానీ కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. ఈ సినిమాలకు చాలా మంది అభిమానులు ఉన్నారు, కానీ డబ్బులు మాత్రం రాలేదు. దీనిపై నాని అలా చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
My producers are saying otherwise.
Abt the financial profits 🙂
Few times sharing them with me too ☺️#AskNani https://t.co/RPaqyMi7cN— Nani (@NameisNani) March 15, 2023