Nani Bloody Romeo movie enters Sujeeth Cinematic Universe
Sujeeth: సినిమాటిక్ యూనివర్స్ అనేవి ఒకప్పుడు హాలీవుడ్ లో మాత్రమే కనిపించేవి. కానీ, ఇప్పుడు ఇండియన్ సినిమాల్లోకి కూడా ఆ కాన్సెప్ట్ వచ్చేసింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో ఇప్పటికే రెండు మూడు యూనివర్స్ లో క్రియేట్ అయ్యాయి. వాటిలో, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్, హిట్ యూనివర్స్, సుజీత్(Sujeeth) సినిమాటిక్ యూనివర్స్ లు ఉన్నాయి. వీటిలో దేనికదే ప్రత్యేకం అని చెప్పాలి.
ఇందులో, ఇటీవల భారీ హైప్ క్రియేట్ చేసిన యూనివర్స్ ఏదైనా ఉంది అంటే అది సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ అనే చెప్పాలి. ఈ దర్శకుడు ఇటీవల చేసిన ఓజీ సినిమాతో ప్రభాస్ సాహూ సినిమాను లింక్ చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ చిన్నప్పటి పాత్రను అలా చూపించి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు. దాంతో, ఈ యూనివర్స్ లో రానున్న మిగతా సినిమాలపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, యూనివర్స్ ఎండింగ్ లో అందరు హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపించి అలరిస్తారు. అందుకే, ఈ యూనివర్స్ పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
అయితే, తాజాగా ఈ యూనివర్స్ లోకి మరో స్టార్స్ ని తీసుకురాబోతున్నాడు దర్శకుడు సుజీత్. ఇటీవల ఆయన తన నెక్స్ట్ సినిమాను నేచురల్ స్టార్ నానితో స్టార్ట్ చేశాడు. అదే బ్లడీ రోమియో. రీసెంట్ గానే ఈ సినిమా అధికారికంగా స్టార్ట్ అయ్యింది. అయితే, ఈ సినిమాలో నాని గ్యాంగ్ స్టర్ కామ్ చెఫ్ గా కనిపించనున్నాడు. అయితే, ఈ సినిమాను కూడా సుజీత్ థన్ యూనివర్స్ కి లింక్ చేస్తున్నాడు అనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఎందుకంటే, దర్శకుడు సుజీత్ రీసెంట్ గా తన సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్, ప్రభాస్, నాని కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. దీంతో, ఈ ఫోటో సుజీత్ యూనివర్స్ కి సంబంధించింది అని, తప్పకుండా నాని సినిమాకి యూనివర్స్ కి లింక్ ఉంటుంది అంటూ నెటిజన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ వార్త గనక నిజం అయితే, నాని సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవడం ఖాయం. అలాగే.. ప్రభాస్, పవన్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమాను భుజాన వేసుకునే అవకాశం ఉంటుంది. మరి, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ న్యూస్ నిజమేనా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.