Nani Chit Chat With Raviteja For Dasara Ravanasura Promotions Goes Viral
Nani: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమా రానుండటంతో ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా, మార్చి 30వ తేదీన దసరా చిత్రాన్ని భారీ అంచనాల మధ్య రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు దసరా టీమ్ అదిరిపోయే ప్రమోషన్స్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మాస్ రాజా రవితేజతో నేచురల్ స్టార్ నాని చేసిన ముచ్చట్లు ఓ రేంజ్‌లో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా కోసం ‘రావణాసుర’ సినిమా హీరోతో నాని చేసిన ముచ్చట్లు ఎలా ఉండబోతున్నాయా అని ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
Nani : నీ సినిమాలు బాగుంటాయి కానీ డబ్బులు రావు నానికి అభిమాని ప్రశ్న.. నాని ఏం చెప్పాడో తెలుసా?
అయితే ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఓ పోస్టర్‌ను నాని అండ్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో నాని దసరా మూవీతో పాటు రవితేజ ‘రావణాసుర’ చిత్ర ప్రమోషన్స్ కూడా ఒకేసారి జరుగుతున్నాయా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక దసరా మూవీలో నాని సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
Did something fun with my dearest @RaviTeja_offl ♥️ 🙂#Dasara #Ravanasura pic.twitter.com/XPWHyzihNZ
— Nani (@NameisNani) March 23, 2023