Nani gives Photo to a Old Women fan of him in Saripodaa Sanivaaram Success Event Photos Videos goes Viral
Nani : ఇటీవల నాని సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా నిన్న రాత్రి సరిపోదా శనివారం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్లో నాని ఓ బామ్మని స్టేజిపైకి పిలిపించి మరీ ఫోటో ఇచ్చాడు. ఈ బామ్మ ఎవరో గుర్తున్నారా?
Also Read : Tollywood : తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం.. భారీ విరాళాలు ఇస్తున్న టాలీవుడ్ యూనియన్లు..
సినిమా రిలీజ్ కి ముందు నాని సరిపోదా శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సుదర్శన్ థియేటర్లో జరిగితే అక్కడికి ఓ బామ్మ వచ్చింది. అసలు అలాంటి ఫుల్ జనాలు ఉండే ఈవెంట్స్ కి అంతా ఫ్యాన్స్, యూత్ వస్తారు. కానీ ఈవెంట్లో నాని బామ్మని చూసి ఆశ్చర్యపోయాడు. హీరోయిన్ ప్రియాంక నానికి జనాల్లో కూర్చున్న బామ్మని చూపించింది. బామ్మని చూసిన నాని.. బామ్మ గారు మీ మనవడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ రోజు ఈవెంట్లో మీరే స్పెషల్ హైలెట్ అని అన్నారు. దీంతో అప్పుడు ఆ బామ్మ వైరల్ గా మారింది.
ఇప్పుడు మరోసారి ఆ బామ్మ వైరల్ అవుతుంది. సరిపోదా శనివారం సక్సెస్ ఈవెంట్ కి కూడా ఈ బామ్మ వచ్చింది. ఈవెంట్ అయ్యాక బామ్మని స్టేజి మీదకి పిలిపించి మరీ నాని, ప్రియాంకలు కలిసి బామ్మతో ఫోటో దిగారు. నాని, ప్రియాంక ఇద్దరూ బామ్మని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని మరీ ఫోటో ఇచ్చారు. దీంతో ఈ బామ్మ ఫోటోలు, వీడియోలు మరోసారి వైరల్ గా మారాయి. నానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యాన్స్ ఎక్కువ అని మరోసారి రుజువైంది.