Nithiin – Nani : నితిన్ సినిమాకి నాని అసిస్టెంట్ డైరెక్టర్.. అప్పుడు నితిన్‌ని, నాని ఏమని పిలిచేవాడో తెలుసా..?

2005లో నితిన్ సినిమాకి నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నప్పుడు నితిన్‌ని, నాని ఏమని పిలిచేవాడో తెలుసా..?

Nani how to call Nithiin when he do assistant director job

Nithiin – Nani : టాలీవుడ్ హీరోలు నితిన్, నానికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ ఇద్దరు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నారు. కాగా ఈ ఇద్దరు కెరీర్ స్టార్టింగ్ కలిసి ఒక సినిమాలో పని చేశారు. అయితే ఆ సినిమాలో నితిన్ హీరో అయితే నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. నాని తన కెరీర్ ని అసిస్టెంట్ డైరెక్టర్ గానే మొదలుపెట్టారు. స్టార్ డైరెక్టర్ బాపు దగ్గర వర్క్ చేసిన నాని.. శ్రీకాంత్, నితిన్, మంచు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

ఈక్రమంలోనే 2005లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ‘అల్లరి బుల్లోడు’ సినిమాకి నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఆ సమయంలో నానితో తన స్నేహని నితిన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ మూవీ షూటింగ్ లో నాని ఒక్కడే నితిన్ తో ఎక్కువ మాట్లాడేవారట. కాగా ఆ సమయంలో హీరోలను ‘బాబు’ అని పిలవడం ఒక ఆనవాయితీగా ఉండేది. నిర్మాతలు, దర్శకులు అందరూ హీరోలను అలానే పిలిచేవారు. కానీ నాని మాత్రం నితిన్ ని పేరు పెట్టి పిలిచేవారట.

Also read :Allu Aravind : చిరంజీవిపై కామెంట్స్ చేస్తున్న వారిపై అల్లు అరవింద్ ఫైర్.. అసలు ఏమైంది..? 

అలా పిలిపించుకోవడం నితిన్ కూడా ఇష్టపడేవారట. ఆయనకు బాబు అని పిలిస్తే నచ్చేది కాదట. దీంతో నితిన్ ని నాని పేరు పెట్టి పిలుస్తూనే వచ్చేవారట. ఇక ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత గమనించి నాని క్యూస్షన్ చేశారట. హీరోని పేరు పెట్టి పిలుస్తున్నావు ఏంటి..? బాబు అని పిలువు అని చెప్పారట. అయితే నితిన్, నాని పిలిచి.. వాళ్ళు అలానే చెబుతారు. నువ్వు నితిన్ అనే పిలువు అని చెప్పారట.

అయితే నితిన్ అని కాకుండా నాని ‘నిత్’ అని పిలిచేవారట. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతుంది. కాగా నాని నటించిన ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న, నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ డిసెంబర్ 8న ఒక రోజు గ్యాప్ తో రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ రెండు సినిమాలు ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు