వరుస విజయాలు, చిత్రాలతో ముందుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దేవదాస్ విజయం అందించిన ఉత్సాహంతో జెర్సీ చిత్రాన్ని ప్రారంభించాడు.
వరుస విజయాలు, చిత్రాలతో ముందుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దేవదాస్ విజయం అందించిన ఉత్సాహంతో జెర్సీ చిత్రాన్ని ప్రారంభించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘జెర్సీ’ ఈ నెల 19న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ..గౌతమ్ ‘జెర్సీ’ కథ చెప్పగానే ఓకే అన్నాను. త్వరగా సెట్స్‌పైకి వెళ్లడం త్వరత్వరగా చిత్రీకరణ పూర్తవడం ఈ సినిమా పోస్టర్లు, టీజర్ చూసి క్రికెట్ నేపథ్యంలో ఉంటుందనుకుంటున్నారు. కానీ, చాలా ఎమోషనల్‌గా ఉంటుంది’’ అన్నారు నాని.
Read Also : జగన్ వైసీపీని బీజేపీలో కలిపేస్తారు: నారా రోహిత్
ఈ సినిమా క్లైమాక్స్ మ్యాచ్ 14 రాత్రుళ్లు మంచి చలిలో చిత్రీకరించాం. ఈ సినిమా చేస్తున్నప్పుడు క్రికెటర్ల కష్టం తెలిసింది. ఈ సినిమా షూటింగ్ వల్ల బరువు కూడా తగ్గాను. ఈ చిత్రాన్ని 20 సార్లు చూశా. సినిమా చూస్తున్నంత సేపు మీరు నన్ను కాదు.. అర్జున్ పాత్రని మాత్రమే చూస్తారు. 36 ఏళ్ల వయసులో తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే అర్జున్ అనే రంజీ క్రికెటర్ కథ ఇది. రంజీ మ్యాచ్‌లు ఆడుతున్న అతను ఎప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనే ప్రయత్నంలోనే ఉంటాడు అని తెలిపారు నాని.
అంతేకాదు గౌతమ్ వల్ల ఇండస్ట్రీకి మరో మంచి డైరెక్టర్ దొరికాడు’’ అన్నారు. అయితే అనుకున్నట్లు ఈ నెల 19న సినిమా కచ్చితంగా రిలీజ్ చేస్తున్నాం. ముందు తెలుగులో, ఆ తర్వాత చైనాలో విడుదల చేస్తాం’’ అన్నారు.
Read Also : బర్త్‌డే పార్టీలో మహేష్, తారక్ సందడి!