నేచురల్ స్టార్ నాని మసాలా శెనగ కర్రీ చేయగా నాగశౌర్య ఆవకాయ పచ్చడి పెట్టడం నేర్చుకున్నాడు..
కరోనా కారణంగా సినిమా షూటింగులు నిలిచిపోయాయి. సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎక్కవ శాతం మంది ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తున్నారు. మరికొంత మంది తమకు నచ్చిన పనులు చేస్తూ, కొత్త సినిమాల కోసం ప్రిపేర్ అవుతూ వాటి తాలూకు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని కుకింగ్ క్లాస్ స్టార్ట్ చేసాడు. తనలోని నలభీముడిని బయటకి తీసుకొచ్చి మసాలా శెనగకర్రీ ఎలా చేయాలో నేర్పించాడు. నాని కర్రీ తయారు చేసే విధానం చాలా మంది బ్యాచిలర్ బాబులను ఆకట్టుకుంటోంది.
Read Also : ఇంట్లోనే ఉండి నమాజ్ చేస్తున్నా- డబ్బు సంపాదించే సమయం కాదు..
మరో యంగ్ హీరో నాగశౌర్య అమ్మ ఉషా ముల్పూరి దగ్గర ఆవకాయ పెట్టడం నేర్చుకుంటున్నాడు. సల్మాన్ ఖాన్ తన మేనల్లుడితో కలిసి ఫామ్‌హౌస్‌లో సందడి చేస్తున్నాడు. కత్రినా కైఫ్ అంట్లు తోముతున్న వీడియోను షేర్ చేసింది. మళ్లీ షూటింగులు ప్రారంభయ్యే వరకు మన సెలబ్రిటీల పరిస్థితి ఇంతే మరి..
The natural star @NameisNani is literally the example for many boys right now!!#QuarantineLife #NewSkills pic.twitter.com/WljeVIzJfn
— Shreyas Group (@shreyasgroup) March 24, 2020
Avakai…♥♥
Learning from mom#Avakai #Homemade #JanathaCurfew #DayWithFamily pic.twitter.com/xQ2ifqaDGF— Naga Shaurya (@IamNagashaurya) March 22, 2020