Nani: నాని – శేఖర్ కమ్ముల మధ్య గొడవ? అసలు ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలిస్తే షాక్ అవుతారు!

నాని(Nani) కోసం మంచి ఫీల్ గుడ్ స్టోరీని సిద్ధం చేసిన సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల.

Nani rejected director Sekhar Kammula story.

  • శేఖర్ కమ్ములను రిజెక్ట్ చేసిన నాని
  • మాస్ సినిమావె కావాలంటున్న నేచురల్ స్టార్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్

Nani: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరీర్‌ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లే పనిలో పడ్డారు. ముఖ్యంగా టైర్-1 హీరోగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. అందుకే, వరుసగా మాస్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. క్లాస్ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నాని(Nani), ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టే మాస్ మసాలా చిత్రాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపధ్యంలోనే క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పిన కథకు నో చెప్పాడట.

సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాలు చాలా క్లాస్‌గా, సున్నితమైన భావోద్వేగాలతో సాగుతుంటాయి. నాని కోసం ఆయన ఒక మంచి కథను సిద్ధం చేసినప్పటికీ, ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం మాస్ సినిమాలపైనే ఉందని నాని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. “ప్రస్తుతానికి నేను మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాను, మళ్ళీ క్లాస్ సినిమాల వైపు రావడం కష్టం సార్” అంటూ నాని సున్నితంగా తిరస్కరించడంతో శేఖర్ కమ్ముల కొంత అసహనానికి గురైనట్లు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ChiruOdela: తెరపైకి చిరంజీవి- మోహన్ బాబు కాంబో.. విలన్ గా రాజశేఖర్.. సంచలనంగా మారుతున్న లేటెస్ట్ అప్డేట్

గతంలో నాగచైతన్య హీరోగా వచ్చిన ‘లవ్ స్టోరీ’ చిత్రానికి కూడా మొదట నానినే అనుకున్నారట శేఖర్ కమ్ముల. అప్పట్లో కూడా నాని ఆసక్తి చూపకపోవడంతో ఆ అవకాశం చైతూ వద్దకు వెళ్ళింది. ఇలా వరుసగా తన ప్రాజెక్టులను తిరస్కరించడంతో నానిపై శేఖర్ కమ్ముల కొంత అసంతృప్తితో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రం ‘హ్యాపీడేస్ 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి అయిన ఈ ప్రాజెక్టుపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి భవిష్యత్తులో అయినా నాని శేఖర్ కమ్ములతో సినిమా చేస్తాడా అనేది చూడాలి.