Nani Serious Comments on Movie Matters Leaks Issue
Nani : ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ సక్సెస్ తో దూసుకుపోతున్న హీరోలలో నాని ఒకరు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హ్యాట్రిక్ సాధించిన నాని త్వరలో హిట్ 3 సినిమాతో రాబోతున్నాడు. హిట్ 3 సినిమా మే 1న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజయిన టీజర్, ట్రైలర్స్ తో ఈ సినిమాలో చాలా వైలెన్స్ ఉందని తెలుస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం నాని మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. అయితే హిట్ 3 సినిమాలో హిట్ 4 సినిమా హీరో ఎవరు అనేది క్లైమాక్స్ లో ఉంటుందని, ఆ హీరో పేరు కూడా చెప్తూ పలువురు జర్నలిస్టులు లీక్ చేసారు అని హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో స్పందించడమే కాక ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా శైలేష్ కొలను ఫైర్ అయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని దీనిపై స్పందించాడు.
నాని మాట్లాడుతూ.. సినిమా గురించి అంచనాలు పెంచడానికి ఏది లీక్ చేయాలి, లీక్ చేయకూడదు కూడా తెలిసి ఉండాలి. మేము టెర్రరిస్టులము కాదు కదా. మా మీద స్పై పెట్టి లోపల ఏం జరుగుతుంది అని తెలుసుకోడానికి. ఎందుకు అలా చేస్తున్నారు. మీ సోర్సెస్ మీకు ఉండొచ్చు. కానీ అది తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు చేయడం. అలా తెలుసుకొని అప్డేట్స్ ఇవ్వడం ఎందుకు. కొంతమంది లీక్ చేసి ప్రేక్షకుడి అనుభవాన్ని పోగొడుతున్నారు. మేము థియేటర్లో గొప్పగా చూపించాలి అనుకుంటాం. దాన్ని ముందే రివీల్ చేసేస్తారు. పోస్టర్స్, టీజర్లు, ట్రయలర్స్ ముందే అలా ఉంటుంది, అందులో ఈ డైలాగ్ ఉందని చెప్పేస్తే అది కాస్త సినిమాకు డ్యామేజ్ జరుగుతుంది. మీరు క్యూరియాసిటీ కోసం చేసినా సినిమాకు నెగిటివ్ అవుతుంది. సినిమా హైప్ పెంచడానికి చెప్పండి కానీ అసలు కంటెంట్ ని లీక్ చేయకండి అని కాస్త సీరియస్ గానే చెప్పాడు.
Also Read : Sunitha : సింగర్ ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత.. తను ఓటమిని తీసుకోలేకపోతుంది అంటూ..