Hit 3 Twitter Review : నాని ‘హిట్ 3’ మూవీ ట్విట్టర్ రివ్యూ..

సినిమా చూసిన ఫ్యాన్స్, ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

Nani Hit 3 Movie Twitter Review

Hit 3 Twitter Review : హిట్ సిరీస్ లో భాగంగా వచ్చిన మూడో సినిమా హిట్ 3. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో నాని, శ్రీనిధి జంటగా హిట్ 3 సినిమా తెరకెక్కింది. ఈ సినిమా నేడు మే 1న పాన్ ఇండియా వైడ్ థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇప్పటికే అమెరికాలో షోలు పడ్డాయి. ఏపీలో కూడా తెల్లవారుజామున షోలు పడ్డాయి. దీంతో సినిమా చూసిన ఫ్యాన్స్, ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

సినిమా ఎలా ఉందో, నాని ఎంత బాగా యాక్ట్ చేసాడో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

హిట్ 3 సినిమా మీద ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. ఓపెనింగ్ బుకింగ్స్ కూడా ఊహించని విధంగా వచ్చాయి.

సినిమాలో నాని అదరగొట్టాడని, బ్లడ్ బాత్ చూపించాడని అంటున్నారు. మధ్యలో కొంచెం ల్యాగ్ ఉందని పలువురు ప్రేక్షకులు అంటున్నారు.