Bloody Romeo: నాని ఫ్యాన్స్‌కు షాక్.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. OG 2కి షిఫ్ట్ అయిన సుజీత్

నాని బ్లడీ రోమియో(Bloody Romeo) మూవీ తాత్కాలికంగా ఆగిపాయింది అనే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Nani, Sujeeth Bloody Romeo stopped, The director reportedly working on OG 2

  • నాని ‘ది పారడైజ్’ షూటింగ్ బిజీ.
  • ‘బ్లడీ రోమియో’ భారీగా వాయిదా.
  • సుజీత్ దృష్టి ‘OG 2’పై.

Bloody Romeo: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. శ్రీకాంత్ ఓదెల, సుజీత్, సీబీ చక్రవర్తి వంటి టాలెంటెడ్ దర్శకులతో ఆయన తన లైనప్‌ను పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. అయితే నాని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లడీ రోమియో’ షూటింగ్ ఇప్పుడు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది పారడైజ్’ చిత్రమేనని సమాచారం. ఈ సినిమా అవుట్‌పుట్ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ మరింత సమయం తీసుకుంటున్నారు.

Nirupam Paritala: డాక్టర్ బాబు రియల్ లైఫ్ ఫ్యామిలీ.. నిరూపం పరిటాల క్యూట్ ఫోటో గ్యాలరీ

మొదట 2026 వేసవిలోనే విడుదల కావాల్సిన ‘ది పారడైజ్’, క్వాలిటీ కారణాల వల్ల ఆగస్టు 21కి వాయిదా పడింది. ప్రస్తుతం నాని తన పూర్తి కాల్ షీట్స్, ఫోకస్‌ను ఈ భారీ ప్రాజెక్టుకే కేటాయించాల్సి రావడంతో, సుజీత్ దర్శకత్వంలో రావాల్సిన ‘బ్లడీ రోమియో’ ప్రారంభానికి బ్రేక్ పడింది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో లేదా 2027లోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. నాని(Bloody Romeo) డేట్స్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి రావడంతో దర్శకుడు సుజీత్ తన వ్యూహాన్ని మార్చుకున్నారు.

‘బ్లడీ రోమియో’ పనులు తాత్కాలికంగా ఆగిపోయిన కారణంగా, సుజీత్ తన దృష్టిని పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘OG 2’ స్క్రిప్ట్‌పై మళ్లించారు. ‘OG’ భారీ విజయం సాధించడంతో, సీక్వెల్‌ను అంతకు మించిన పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తీర్చిదిద్దేందుకు ఆయన కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం పక్కాగా స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్న సుజీత్, నాని అందుబాటులోకి వచ్చినప్పుడు ‘బ్లడీ రోమియో’ను పట్టాలెక్కించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో నాని సినిమా కాస్త ఆలస్యమైనా, సుజీత్ మాత్రం మరో భారీ ప్రాజెక్టుతో సిద్ధమవుతున్నారు.