Republic : నాని ‘రిపబ్లిక్’ రివ్యూ చెప్పేసాడుగా..
నేచురల్ స్టార్ నాని.. సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ స్పెషల్ షో చూసి.. సోషల్ మీడియా ద్వారా తన స్పందన తెలియజేశాడు..
- sekhar
- Published on- September 30, 2021 / 11:31 AM IST
Republic
Republic: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అతను నటించిన ‘రిపబ్లిక్’ సినిమా అక్టోబర్ 1న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతోంది. నేచురల్ స్టార్ నాని రీసెంట్గా ‘రిపబ్లిక్’ స్పెషల్ షో చూసి.. సోషల్ మీడియా ద్వారా తన స్పందన తెలియజేశాడు.
Republic Trailer : ‘అజ్ఞానం గూడు కట్టినచోటే.. మోసం గుడ్లు పెడుతుంది’..
‘రిపబ్లిక్’ సినిమా చూశాను.. చాలా బాగుంది.. తేజ్ కోలుకోవాలని మనమందరం చేసిన ప్రేయర్స్ ‘రిపబ్లిక్’ రూపంలో బలంగా తిరిగి వచ్చింది. దర్శకుడు దేవ కట్టాకు ఇది కమ్‌బ్యాక్ ఫిలిం.. టీం అందరికీ నా కంగ్రాట్స్’ అంటూ నాని ట్వీట్ చేశాడు.
Love Story : ఆ ముద్దు సీన్లు ఎలా చేశామంటే..
‘ప్రస్థానం’ సినిమాతో రాజకీయాలను సరికొత్త కోణంలో చూపించిన దేవ కట్టా మరోసారి పాలిటిక్స్‌ని బేస్ చేసుకుని.. సొసైటీకి అవగాహన కల్పించేలా మంచి కథ రాసుకున్నారని, సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ప్రేక్షకుల్లో సినిమా మీద అంచనాలు పెంచేసింది ‘రిపబ్లిక్’ ట్రైలర్..
