స్పెషల్ డే సర్‌ప్రైజ్ షేర్ చేసిన నారా రోహిత్

నారా రోహిత్ మే 5 తనకు ఎంతో ప్రత్యేకమంటూ ట్వీట్ చేశారు..

  • Publish Date - May 5, 2020 / 02:31 PM IST

నారా రోహిత్ మే 5 తనకు ఎంతో ప్రత్యేకమంటూ ట్వీట్ చేశారు..

యువ హీరో నారా రోహిత్ నిన్న షాకింగ్ పిక్ షేర్ చేసి అందర్నీ సర్‌ప్రైజ్ చేసిన సంగతి మర్చిపోకముందే ఈరోజు మరో మెమరబుల్ ట్వీట్ చేశాడు. మే 5 రోహిత్‌కి ఎప్ప‌టికీ గుర్తుంచుకొనే ప్ర‌త్యేక‌మైన రోజు.. ఆయ‌న న‌టించిన మొద‌టి చిత్రం ‘బాణం’ 2009లో విడుదలైంది ఈ రోజే. ఈ స్పెష‌ల్ డేకి, నారా రోహిత్ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ ట్విట్ట‌ర్‌లో జాయిన్ అయ్యాడు. @IamRohithNara అనే హ్యాండిల్‌తో ట్విట్ట‌ర్‌లో అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా ‘బాణం’ మూవీ సెట్స్‌పై ఫస్ట్ డే తీసుకున్న పిక్ పోస్ట్ చేశాడు. త‌న తొలి ట్వీట్‌ను పెద‌నాన్న చంద్ర‌బాబునాయుడు, అన్న నారా లోకేష్‌కు ట్యాగ్ చేయడం విశేషం.

‘‘2009లో ఈ రోజు, ఇది ‘బాణం’ మూవీలో నా ఫ‌స్ట్ షాట్‌. ఈ సంద‌ర్భంగా నా మెంటార్‌, పెద‌నాన్న చంద్ర‌బాబునాయుడు‌గారు, డియ‌రెస్ట్ లోకేష్ అన్న స‌ర‌స‌న ట్విట్ట‌ర్‌లో జాయిన్ అవ‌డం గౌరవంగా, ఆనందంగా ఉంది. ఒక గొప్ప వ్య‌క్తి అన్న‌ట్లు, కుటుంబం అనేది జీవశాస్త్రం కాదు, అది ఒక విశ్వాసం’’ అంటూ నారా రోహిత్‌ త‌న తొలి ట్వీట్‌ను పోస్ట్ చేశాడు. త‌న త‌దుప‌రి సినిమా కోసం బరువుతగ్గి, ఫిట్‌గా త‌యార‌య్యాడు రోహిత్‌. 

Read Also : బాలయ్య అల్లుడు ఎంత మారిపోయాడో.. ఈ హీరోని గుర్తు పట్టారా!