Nara Rohith : తండ్రి కాబోతున్న నారా రోహిత్..? శిరీష బేబీ బంప్ ఫోటో వైరల్..

తాజాగా ఈ జంట పేరెంట్స్ కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి.(Nara Rohith)

  • Published on- April 30, 2026 / 07:19 PM IST

Nara Rohith

Nara Rohith : నారా రోహిత్ ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నాడు. నారా రోహిత్ ప్రతినిధి 2 సినిమాలో నటించిన శిరీష అనే నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2025 అక్టోబర్ లో వీరి పెళ్లి అయింది. ఈ జంట పెళ్లి ఫొటోలు కూడా వైరల్ గా మారాయి. పెళ్లి తర్వాత కూడా ఈ ఇద్దరూ కలిసి సుందరకాండ సినిమాలో నటించారు.

Also Read : Reba Monica John : ప్రగ్నెంట్ అయిన హీరోయిన్.. భర్తతో బేబీ బంప్ ఫోటోషూట్.. ఫొటోలు వైరల్..

తాజాగా ఈ జంట పేరెంట్స్ కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. నారా రోహిత్ భార్య శిరీషా లేళ్ల ప్రగ్నెంట్ అని టాలీవుడ్ లో టాక్. ఇటీవల ఓ రిలేటివ్స్ ఫంక్షన్ కి వెళ్లగా అక్కడ ప్రగ్నెన్సీతో కనిపించిందని సమాచారం. శిరీష బేబీ బంప్ తో ఉన్న ఓ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఆ ఫోటో చూసి త్వరలోనే నారా రోహిత్ తండ్రి కాబోతున్నాడు అంటూ కంగ్రాట్స్ చెప్తున్నారు. అయితే దీనిపై నారా రోహిత్, శిరీష ఇద్దరూ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.