#MayaLo Review : #మాయలో రివ్యూ.. ప్రేమ, స్నేహంలో రొమాంటిక్ కామెడీతో..

యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన #మాయలో సినిమా డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

#MayaLo Review : #మాయలో రివ్యూ.. ప్రేమ, స్నేహంలో రొమాంటిక్ కామెడీతో..

Naresh Agastya Gnaneswari Kandregula MayaLo Movie Review and Rating

#MayaLo Review : ఇటీవల పలు చిన్న సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నరేష్ అగస్త్య(Naresh Agastya), జ్ఞానేశ్వరి(Gnaneswari)లతో పాటు భావన, RJ హేమంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా #మాయలో. మేఘా మిత్ర పేర్వార్ దర్శకత్వంలో ఫ్రేమ్‌ బై ఫ్రేమ్ పిక్చర్స్‌ బ్యానర్ పై షాలిని నంబు, రాధాకృష్ణ నంబు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ #మాయలో సినిమా డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

కథ విషయానికొస్తే.. మాయ(జ్ఞానేశ్వరి) తాను ప్రేమించిన అబ్బాయితో పెళ్ళికి సిద్దమవుతుంది. పెళ్ళికి తన చిన్ననాటి స్నేహితులు క్రిష్(నరేష్ అగస్త్య), సింధు(భావన)లను పిలుస్తుంది. చిన్నప్పుడు మంచి స్నేహితులు అయినా వీరిద్దరికి ఒకరంటే ఒకరు పడదు. కానీ వీరిద్దరూ ఒకే కార్ లో పెళ్ళికి వెళ్లాల్సి వస్తుంది. దీంతో వారిద్దరి మధ్య ఏం జరిగింది? అసలు వారిద్దరికీ ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఈ స్నేహితుల కథేంటి? పెళ్లి వరకు వారి ప్రయాణం ఎలా సాగింది అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. ఇటీవల ఫ్రెండ్స్, లవ్ ఎంటెర్టైనట్ సినిమాలు చాలానే వస్తున్నాయి. ఎక్కువగా ఓటీటీ కంటెంట్ లో క్లిక్ అవుతున్నాయి సినిమాలు. అలాంటి సినిమాని వెండితెరపైకి తీసుకొచ్చారు చిత్రయూనిట్. ఒక ఫ్రెండ్షిప్, లవ్ కథకి కామెడీ జోడించి సినిమాని నడిపించారు. సినిమా ఎక్కువ భాగం రోడ్ మీద కార్ లో ట్రావెలింగ్ లోనే ఉంటుంది. నరేష్, భావన మధ్య వచ్చే సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ టావెలింగ్ లో వీళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకున్నారు? ఏం చేశారు అని కొంచెం కామెడీగా, అక్కడక్కడా ఎమోషన్ గా ఉంటుంది. సినిమా అయితే బోర్ కొట్టకుండా సాగుతుంది.

నటీనటుల విషయానికొస్తే.. నరేష్ అగస్త్య, భావన తమ కాంబినేషన్ సీన్స్ లో మెప్పించారు. మోడ్రన్ అమ్మాయిగా జ్ఞానేశ్వరి కూడా తన అందాలతో అలరిస్తుంది. ఇటీవల జ్ఞానేశ్వరి వరుస ఛాన్సులు అందుకుంటుంది. పోలీస్ పాత్రలో RJ హేమంత్ కాసేపు నవ్విస్తాడు. మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదనిపిస్తారు.

Also Read : జోరుగా హుషారుగా మూవీ రివ్యూ.. ‘బేబీ’ సినిమా విరాజ్ అశ్విన్ హీరోగా మెప్పించాడా?

టెక్నికల్ అంశాల విషయానికొస్తే.. మేఘా మిత్ర పేర్వార్ యూత్ ని ఆకట్టుకునేలా ఫ్రెండ్షిప్, లవ్ అంశాలపై కామెడీతో మంచి స్క్రిప్ట్ రాసుకొని సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. కెమెరా విజువల్స్ కూడా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా పాటలు మాత్రం పర్వాలేదనిపించాయి. చిన్న సినిమా అయినా నిర్మాణ విలువలు బాగున్నాయి. రామ్ కామ్ సినిమాలు ఇష్టపడేవాళ్లు థియేటర్స్ లో ఈ #మాయలో చూసేయొచ్చు.