Marokkasari : 5,430 మీ. ఎత్తులో మొదటి సారి అక్కడ షూటింగ్ చేసిన తెలుగు సినిమా.. ఇండియాలోనే ఫస్ట్ సినిమా..

అక్కడ షూటింగ్ చేసిన ఏకైక, మొట్టమొదటి ఇండియన్ మూవీగా ‘మరొక్కసారి’ నిలిచింది.

Marokkasari

Marokkasari : నరేష్ అగ‌స్త్య‌, సంజ‌నా సార‌థి జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘మరోక్కసారి’. సి.కె.ఫిల్మ్ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై బి.చంద్ర‌కాంత్ రెడ్డి నిర్మాణంలో నితిన్ లింగుట్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. తాజాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసారు మూవీ యూనిట్ .

ఈ సినిమాని కేరళ, సిక్కిం, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో చాలా అందమైన విజువల్స్ తో చిత్రీకరించారు. ఇంత వరకు ఏ ఇండియన్ సినిమా కూడా షూటింగ్ చేయనటువంటి గురుడోంగ్మార్ లేక్ లాంటి ప్రదేశంలో ఈ ‘మరొక్కసారి’ షూటింగ్ జరుపుకుంది. 5,430 మీ. ఎత్తులో ఉండే గురుడోంగ్మార్ లేక్‌లో షూటింగ్ చేసిన ఏకైక, మొట్టమొదటి ఇండియన్ మూవీగా ‘మరొక్కసారి’ నిలిచింది.

Also Read : Coolie – War 2 : రెండు సినిమాల అడ్వాన్స్ సేల్స్ ఎన్ని కోట్లు తెలుసా? కూలీకి దరిదాపుల్లో కూడా లేని వార్ 2..

తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌ చూస్తుంటే ఓ ఆహ్లాదకరమైన ప్రేమ కథను చూడబోతోన్నామని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాలో నరేష్ అగస్త్య, సంజనా తో పాటు బ్రహ్మాజీ, సుధర్షన్, వెంకట్, వెంకట్ కాకమాను, దివ్యవాణి.. పలువురు నటించారు.